CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధికారుల తీరుపై ఆగ్రహo వ్యక్తం చేసిన జెడ్పిటిసి తల్లడి పుష్పలత.

Share it:

 


మన్యం మనుగడ/వాజేడు: జులై 23:

మండల కేంద్రంలో అధికారుల తీరుపై జెడ్పిటిసి పుష్పలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం 970 మంది ఇల్లు గోదావరి ముప్పుకు గురయ్యాయి.అధికారుల నిర్లక్ష్యం తో లిస్టు 758 పేర్లు వచ్చాయి.అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ ఈ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. రెవిన్యూ అధికారుల వైఫల్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గ్రామాలు కకావికలమయ్యాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గ్రామాలు నేడు బురదతో నిండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు గోదావరి మహోగ్రరూపానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా నీట మునిగిన ఇళ్లు ఇప్పుడిప్పుడే బయల్పడుతున్నాయి. నాలుగు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులు ఇళ్లకు వెళ్లారు.తమ ఇళ్లు నేలకొరిగిపోయి ఉండడం, గోడలు దెబ్బతినడం, బురద పేరుకు పోవడం వంటి దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇళ్ల లోపల, బయట బురదమయంగా మారింది. పూరిళ్లు రూపురేఖలు కోల్పోయాయి. తలుపులు, ఇంట్లో ఉంచిన సామాగ్రి సైతం వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. విద్యుత్‌ తీగలు ఎక్కడకక్కడ తెగిపడ్డాయి.గ్రామాల్లో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. మళ్లీ గోదావరి వస్తుంది తగ్గుతుంది.ఎప్పటికి తేరుకుంటామోనని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంతటి శోకసముద్రంలో ఉన్న వరద బాధితులకు ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకులు కూడా వాళ్లకు అందడం లేదని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పత్రిక ప్రకటనలు పేర్కొన్నారు.

Share it:

TS

Post A Comment: