CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

#GST పన్ను రద్దు చేయాలి#- టీఆర్ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి

Share it:


పినపాక : 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు & ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారి పిలుపు మేరకు బుధవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసనగా ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం పెంచిన GST పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

కేంద్ర ప్రభుత్వం పాలు మరియు పాల ఉత్పత్తుల పైనా ఏనాడు లేని విధంగా GST పన్ను విధించి దేశ ప్రజల పైన భారం వేస్తుందన్నారు. కేంద్రం అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశ ప్రజల పైన మోయలేనటువంటి పన్నులు GST రూపంలో వేస్తుందన్నారు. చివరికి నిత్యావసర సరుకులు మరియు గ్యాస్ ధరలను అత్యధికంగా పెంచి దేశ ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారని అన్నారు. 

మోడీ బీజేపీ ప్రభుత్వం ద్వారా దేశంలో ప్రజలకు గానీ రాష్ట్ర ప్రజల గాని ఎటువంటి ఉపయోగం లేదని పెంచిన GST పన్నులను వెంటనే తగ్గించి పేద ప్రజలకు భారం తగ్గించాలని అన్నారు.


 ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కోలేటి భవానీ శంకర్‌, దాట్ల వాసుబాబు, శ్రీరామ్‌ మూర్తి, శ్రీనివాసరెడ్డి, పోలిశెట్టి సత్తిబాబు, రాయల బాబు, కొండేరు నాగభూషణం, వడ్లకొండ శ్రీను, బత్తుల వెంకటరెడ్డి, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ చింతపాటి సత్యం, సర్పంచ్‌ గొగ్గలి నాగేశ్వరరావు, షేక్‌ జాంగీర్‌, వెన్నా కాశిరెడ్డి, సోంపల్లి తిరపతి, నర్సింహారావు, చిన్నారి, శ్యామల సతీష్, రామారావు, కిషోర్‌, రామయ్య, గాండ్ల అశోక్‌, బూర రమేష్‌, రాంమోహాన్‌, జాడి కిరణ్, రామకృష్ణ, వీరబాబు, సాంబశివరావుతదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: