CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాజేడు ఐటిఐ విద్యాసంస్థలో ప్రవేశాల కొరకు దరఖాస్తు.

Share it:


మన్యం మనుగడ వాజేడు జూలై 22:


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ , ప్రైవేటు ,ఐటిఐ విద్య సంస్థలలో ప్రవేశాల కొరకు ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ కొరకు ప్రభుత్వ ఐటిఐ వాజేడు ప్రిన్సిపాల్ పి, శేఖర్ తెలిపారు. ములుగు జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐటిఐ విద్యాసంస్థలలో 2022 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ నెల 6 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వాజేడు ప్రభుత్వ ఐటిఐలో ప్రారంభించిన మొత్తం ట్రేడ్స్ 1 పిట్టర్,2 ఎలక్ట్రీషియన్,3 ఎలక్ట్రానిక్ మెకానిక్ ,4 డ్రాఫ్ట్ మెన్స్ సివిల్ 5 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రాం అసిస్టెంట్ (కోప) కోర్సులలో ప్రవేశాలు. జరుగుతున్నాయని అన్నారు వీటిలో ప్రవేశాల కోసం కనీసం పదవ తరగతి పాసై ఉండాలని తెలిపారు. ఆగస్టు ఒకటి 2022 నాటికి 14 సంవత్సరాలు నుండి ఉండాలని అన్నారు. గరిష్ట వైపరిమితి కి ఎటువంటి నిబంధనలు లేవని తెలిపారు. అర్హత ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 నుండి 31వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో స్కానింగ్ చేసి అప్లోడ్ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని ఐటిఐ లకు కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే చేయగలరు, అని తెలిపారు. ఇచ్చిన ఆప్షన్స్ లో ఎన్ని కోర్సులు అన్న దగ్గర అన్ని కోర్సులు పైన క్లిక్ ఇవ్వడం ద్వారా సీటు కచ్చితంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటిఐ లో ఆప్షన్ పెట్టుకోవాలని తెలిపారు. వెబ్సైట్: https:// iTI. Telangana.gov.in సంప్రదించగలరు.

Share it:

TS

Post A Comment: