CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పారదర్శకంగా పని చేసే ప్రజా ప్రతినిధి పై అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలం, నిమ్మగూడెం గ్రామపంచాయతీ, తిమ్మాపురం గ్రామంలో శనివారం జరిగిన ఆదివాసీ సంఘాల అత్యవసర సమావేశంలో మాజీ యం పి టి సి కొమరం.సారయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా కొమరం సారయ్య మాట్లాడుతూ, నిత్యం ప్రజా సేవ చేస్తున్న ఒక ఆదివాసీ బిడ్డ పై అసత్య ప్రచారం చేస్తూ, నిరాధారమైన ఆరోపణలు చేసిన చిలుక ప్రవీణ్, మొగుళ్ల భద్రయ్య తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 

అనునిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క పై నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.

మీకు కళ్ళు కనిపించడం లేదా? 

మన రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ నియోజకవర్గములో, ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి సేవ, సీతక్క గారు ప్రాణాలు పణంగా పెట్టి, ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన కరోనా కష్ట కాలంలోను, అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలలో లోతట్టు గోదావరి ముంపు ప్రాంతాలు జలమయమయినప్పుడు కూడా, నిస్వార్థంగా సేవ చేస్తూ, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటున్న విషయాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నారని. ఇలాంటి అసత్యపు ప్రచారాలు ఎవరు నమ్మరని అన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం యూట్యూబ్ వీక్షణల(వ్యూస్) కోసం అసత్యపు ప్రచారాలు చేసి, మీ యు న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ని హైప్ చేసుకోవద్దని, సామాజిక మాధ్యమాలు ఉన్నది నిజాన్ని ప్రజలకు చేప్పడానికి కానీ, అబద్ధాన్ని నిజం చేయడానికి కాదు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

 బలహీన వర్గానికి చెందిన ములుగు సబ్ రజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ పై చేస్తున్న ఆరోపణలను కూడా తీవ్రంగా ఖండించారు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లయితే, రిజిస్ట్రేషన్ లపై అక్రమంగా సంపాదించినట్లైతే, వాటిలో ములుగు ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లయితే, ఆధారాలతో సహా నిరూపించాలని, అంతేగాని అసత్యపు సమాచారాన్ని నిజమని నమ్మించడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించారు. 

ఈ అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఆదివాసీ బిడ్డ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కొమరం.బాలయ్య, కొమరం. రామక్రిష్ణ, కొమరం.నర్శింగరావు కొమరం.వెంకటేశ్వర్లు, కొమరం.సమ్మయ్య, రేష.జగన్నాధం, రేష.మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: