CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి ఒక్కరు పార్టీ కోసం సైనికుల పని చేయాలి.ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆదివారం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,పినపాక నియోజకవర్గంలోని సోషల్ మీడియా వారియర్స్ అంతా ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ లాంటి వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని,ప్రభుత్వ పథకాలను,అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని తెలియజేశారు.గ్రామస్థాయి నుండి సోషల్ మీడియాను బలోపేతం చేయాలని,ప్రతి ఒక్కరు పార్టీ కోసం సైనికుల పని చేయాలన్నారు.తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నదని విప్ రేగా తెలిపారు.సీఎం కేసీఆర్ తన సూపరిపాలనతో ప్రజల గుండెలలో బలమైన స్థానం దక్కించుకున్నారన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేనటువంటి రైతుబంధు,రైతు బీమా,కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ పరిపాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అన్నారు.ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తు రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపామని ఆయన పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ అది నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ నిర్దేశకత్వం లో రాష్ట్రం సంక్షేమ,అభివృద్ధి పథం లో దూసుకుపోతుంది అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని అన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పథకాల ను పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నాయని కొనియాడారు.ఈ కార్యక్రమం లో పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ లంకెల రమేష్ యాదవ్,మారోజు రమేష్,శ్యామల సతీష్,ప్రశాంత్ యాదవ్,కాట్రగడ్డ సురేంద్ర పటేల్,కంచర్ల సందీప్,గుండ్ల రంజిత్ కుమార్,చిట్టిమల్ల. ప్రవీణ్,నజీర్ సోను,గంగాపూరి చంద్రశేఖర్,ఎండి ఆదం,మహేష్ నాయుడు,పాపాల వీరబాబు, చీకటి రఘు,సందీప్ యాదవ్, లోహిత్ యాదవ్,చిట్టి మల్ల సాంబ,శ్రీను,ఎస్కె.నయీమ్,కృష్ణ,మోదుగు వంశీ,మహేష్ యాదవ్,కిరణ్,దాసర రవి, సిరికొండ సంగీత్,వల్లే పోగు రాము,భూక్య రాంబాబు,పూస సంతోష్,బండ మనోజ్ రెడ్డి, గాదర్ల సతీష్ కుమార్,నిట్ట ప్రభాకర్ గోగు వెంకటేశ్వర్లు, బోడ ప్రశాంత్,బొమ్మెర నరేష్, బొమ్మెర పద్మారావు,పసుల శివకృష్ణ,మంగళగిరి రామకృష్ణ, కొరేం రామారావు,తురక రామకోటి,రెడ్డబోయిన మహేష్, ఉదయ్ కిరణ్,వెంకటేష్ చౌదరి, టీ శివశంకర్,జూపల్లి కిరణ్, కొల్లిపాక ఉదయ్ కిరణ్,సోషల్ మీడియా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Share it:

TS

Post A Comment: