CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలి.పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ముందుగా మండల కేంద్రం నుండి పోడు సాగు దారులు భారీ ర్యాలీగా ధర్నా నిర్వహించారు. అనంతరం జరిగిన ర్యాలీని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బి రెడ్డి సాంబశివ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్ లు మాట్లాడుతూ. రాష్ట్రంలో పోరాటాల ఫలితంగా దరఖాస్తులు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములను 2018 వరకు సాగులో ఉన్న వారికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ హక్కు పత్రాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.లేనివేడల పోడు సాగుదారులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ విధానం 2022 తెచ్చి గిరిజనులకు పేసా చట్టాన్ని ధిక్కరించి,ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు వేలాది ఎకరాలు అప్పజెప్పడానికి సిద్ధమవుతుందని అన్నారు. దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని లేని ఎడల భవిష్యత్తులో రాష్ట్ర రాజధాని హైదరాబాదు వరకు పాదయాత్ర చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం బంధాల గ్రామం,ఏటూరు నాగారం మండలం రొయ్యూరు నుండి ఎలిసెట్టిపల్లి వరకు పూర్తిగా రోడ్డు దెబ్బతిందని అదేవిధంగా జంపన్న వాగుపై ఎలిసెట్టిపల్లి వెళ్లే వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని,కన్నాయి గూడెం మండలంలోని కంతనపల్లి గ్రామానికి రోడ్డుకు,చెరువుకు అటవీశాఖ అధికారులు అనుమతులు లేవని నిలిపివేశారని,వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.జిల్లాలో 60 వేల ఎకరాల ఫారెస్ట్,రెవెన్యూ మధ్య వివాదాస్పద భూములు ఉన్నాయని,వీటిని జాయింట్ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి,తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు యండి యాకూబ్,ఆదినారాయణ, ఆదిరెడ్డి,కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు అమ్జా ద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి రెడ్డి సాంబశివ, జ్ఞానం వాసు,కుమ్మరి శ్రీను, చిట్టిబాబు,సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్, గిరిజన సంఘం నాయకులు గొంది రాజేష్,కోరం చిరంజీవి, జజ్జరి దామోదర్,దిగి చిరంజీవి, తోలం కృష్ణయ్య,కావేరి సుధాకర్,జాగటి చిన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: