CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సొంత ఇంటి పథకం అమలు కోసం సింగరేణి కార్మికులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి:సిఐటియి.

Share it:


మన్యం టీవీ మణుగూరు:

సింగరేణి కార్మికులు సొంత ఇంటి పథకం అమలు కోసం సింగరేణి కార్మికులు భవిష్యత్తులో జరిగే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని,సింగరేణి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మంద. నరసింహారావు పిలుపునిచ్చారు.సోమవారం ఓసి 2 లో జరిగిన పిట్ మీటింగులో మాట్లాడుతూ, సింగరేణిలోని కార్మికుల, సొంతింటి కల సాకారం కావాలని,అలాగే వేతన ఒప్పందం త్వరగా జరగాలని జులై 11 వ తారీకు నుండి గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ రాజిరెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ఈ దీక్షకు యావత్ కార్మిక వర్గం మద్దతు తెలియజేయాలని కోరారు.ప్రతి కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలన్నారు.కార్మికులు నివసిస్తున్న క్వార్టర్ శాశ్వతంగా వారికి ఇవ్వాలన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మాణం చేపట్టాలన్నారు.రిటైర్డ్ కార్మికులకు,కాంట్రాక్ట్ కార్మికులకు,ఖాళీగా ఉన్న క్వార్టర్లు ఇవ్వాలన్నారు. బినామీ పేర్ల మార్పు సర్కులర్ వెంటనే జారీ చేయాలన్నారు. డిపెండెంట్ ల వయస్సు 35 నుండి 40 సంవత్సరాల వరకు పెంచాలన్నారు.ఆర్ ఎల్ సి వద్ద జరిగిన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు.పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ 2011 సంవత్సరం నుండి తిరిగి చెల్లించాలన్నారు.190/240 మస్తార్లు నిండిన బదిలీ వర్కర్స్ కు జనరల్ మస్దురుగా చేయాలన్నారు.కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలన్నారు.ఇతర సమస్యలపై జరుగుతున్న పోరాటాలకు కార్మికులు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీవీ ఎంవి ప్రసాద్,వెంకటరత్నం,ఈశ్వరరావు,లక్ష్మణరావు,బొల్లం రాజు, లక్ష్మణరావు,పారుపల్లి బుచ్చిరెడ్డి,విల్సన్,రాజు,శివకుమార్,రాంబరోస్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: