CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి. భద్రాచలం వ్యవసాయ డివిజన్ పరిధిలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా వ్యవసాయ అధికారి.

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


మండలంలోని గంగోలు రైతు వేదిక నందు భద్రాచలం వ్యవసాయ డివిజన్ పరిధి స్థాయిలో భద్రాచలం దుమ్ముగూడెం చర్ల మండలంలో గల విత్తనాలు పురుగుమందులు ఎరువుల డీలర్లకు విత్తన చట్టం ఎరువులు చట్టం పురుగు మందుల చట్టాల పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు ముఖ్య అథిదిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ అందరూ డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు అందాలని స్టాక్ బోర్డ్ బిల్స్ తో అమ్మాలని అర్థరైజ్డ్ కంపెనీ నుండి తెప్పించిన ఎరువులు విత్తనాలు, ప్రతి ఒక్క డీలర్లు దేశీ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలని అనుమతి ఉన్న షాప్ లలో రైతులు ఎరువులు కొనాలని సూచించారు. ఏడిఏ లాల్ చంద్ మాట్లాడుతూ పచ్చిరొట్ట పైరుని ప్రోత్సహించాలని ఫాస్ఫరస్ సొల్యూలైజేర్ వాడాలని వరి వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని యూరియాను ప్రతి పంటలో మూడు నాలుగు దఫాలుగా ఎరువులు వాడాలని పత్తి పంటలో అధిక సాంద్రతతో మండలానికి వంద ఎకరాల్లో హెచ్డిపిఎస్ టార్గెట్ ఇచ్చి ఎర్ర నీళ్లలో పది నుండి 12 క్వింటాల దిగుబడి వచ్చే విధంగా పత్తి పంటను ప్రోత్సహించాలని అన్నారు. భద్రాచలం ఏ డి ఏ సుధాకర్ మాట్లాడుతూ పత్తి పంటను ప్రోత్సహించాలని భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలని డీలర్లు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు రైతులకు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఏవో నవీన్ కుమార్ భద్రాచలం ఏవో అనిల్ కుమార్, చర్ల ఏవో శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: