CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బ్యాంక్ ల్లో రుణాల రీపేమెంట్ దందా, సహకరిస్తున్న బ్యాంక్ అధికారులు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.


మంగపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియాలో గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసకుని అగ్రికల్చర్ లోన్ రీపేమెంట్ దందా నిర్వహిస్తున్నారని తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లు కొందరి బయటి దలారులతో చేతులు కలిపి గిరిజనులు బ్యాంకులో తీసుకున్న వ్యవసాయ రుణాల రీపేమెంట్ ను ఓ ధళారితో కట్టిస్తూ దందా నిర్వహిస్తూ లక్షల్లో వసూల్లు చేస్తున్నారన్నారు. గిరిజనులు నేరుగా రుణాల రీ పేమెంట్ చేస్తే వారిని వారం పది రోజులు బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వ్యవసాయ రుణాలు ఇవ్వడంలేదని అదే రుణాలను దళారి ఎకౌంట్ నుండి జమ చేస్తే తెల్లవారే వారికి వ్యవసాయ రుణాలకు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారని ఆరోపించారు, ఈ విధంగా వెయ్యికి ఒక్క రోజులో 3 నుండి పది రూపాయల వడ్డీ వసూల్లు చేస్తు అమాయక గిరిజన రైతులను దోచుకుంటున్నారని అన్నారు. మండలంలోని కోమటిపల్లి, కొత్తూరు మొట్లగూడెం, నర్సాయిగూడెం, నర్సింహాసాగర్ గ్రామపంచాయతీలకు చెందిన గిరిజన రైతులను టార్గెట్ పెట్టుకున్న బ్యాంకు అధికారులు దళారితో వారి వ్యవసాయ రుణాలను కట్టిస్తూ రెండు సంవత్సరాల కాలంలో రెండు కోట్ల వరకు వసూల్లు చేశారని తెలిపారు. దందాకు అలవాటు పడ్డ బ్యాంకు అధికారులకు దళారి రోజు ధాబాల నుండి లంచ్ టై్ంలో బిర్యానీలు తినిపిస్తున్నాడని అధికారుల ఇల్లలో జరిగే బర్త్ డే, మ్యారేజ్ డేలకు దళారి ఖర్చులు పెడుతున్నట్లు ఆరోపించారు. రెండు సంవత్సరాల కాలంలో దళారి ఎకౌంట్ నుండి రైతులకు కట్టిన లెక్కలు రైతుల ఖాతాల నుండి దళారి ఖాతాలోకి వచ్చిన లెక్కలు బయటపెట్టి గిరిజన రైతులకు వాపస్ ఇవ్వాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది. లేని పక్షంలో గిరిజన రైతులతో బ్యాంకు ముట్టడి చేస్తామని హెచ్చరించారు..

ఈ కార్యక్రమంలో...

జిల్లా కార్యదర్శి మడకం చిట్టిబాబు, కాపుల సమ్మయ్య, జిల్లా సీనియర్ నాయకులు కణితి వెంకట కృష్ణ, పొడెం నర్సింగరావు, మలకం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: