CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం.

Share it:


మన్యం మనుగడ /వాజేడు: జులై 22: మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ మందిరంలో సర్వ సభ్య సమావేశము ఎంపీడీవో విజయ ఆదేశానుసారం, ఎంపీపీ శ్యామల శారద అధ్యక్షతన సజావుగా జరిగినది. ఎమ్మెల్యే పోదెం వీరయ్య పర్యటన పలు గ్రామాలలో ఉండడంతో,సమావేశానికి కొంచెం లేటుగా వచ్చిన సర్పంచులు, సమావేశములో ప్రదానంగా విద్యా, వ్యవసాయం,మిషన్ భగీరథ, విధ్యుత్ శాఖ, హర్టీకల్చర్, పంచాయత్ రాజ్ మత్స్యశాఖ, ఐసిడిఎస్, చైల్డ్ లైన్ డిస్టిక్ ఆఫీసర్,శాఖల ప్రగతి పై సమీక్ష జరిపినారు. కానీ షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో జరిగే సర్వసభ్య సమావేశం ప్రాథమికంగా సమస్యలని అధికారుల దృష్టికి చేరవేయడం, షెడ్యూల్ సమస్యల పట్ల, ఆదివాసీల సమస్యల పట్ల ఆదివాసీల హక్కులు, చట్టాల గూర్చి సర్వసభ్య సమావేశంలో చర్చించకపోవడం దురదృష్టకరం ఆదివాసి ప్రజల సమస్యలు ప్రభుత్వానికి ఏ విధంగా నివేదికలు ఇస్తారు. ఆదివాసి హక్కులు ఎప్పటికీ అమలు అవుతాయో అని ఆదివాసి ప్రజల ఎదురుచూపు. గోదావరి ముప్పు గ్రామాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తగు సూచనలు జారీ చేసి యున్నారు. సమావేశములో గౌరవ సభ్యులు వారి పరిదిలో ఉన్నటువంటి సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా మండల పరిషత్ ఎంపీపీ అధికారులు సమస్యల పరిష్కారానికి తగు సూచనలు, మార్గ నిర్దేశనము చేసినారు. జడ్పిటిసి తల్లడి పుష్పలత ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల సమందిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.


చైల్డ్ లైన్ డిస్టిక్ డిసిపిఓ ఓంకార్

ఈ సందర్భంగా ములుగు జిల్లా చైల్డ్ లైన్ డిసిపిఓ ఓంకార్ మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణకు మండల ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. మానసిక వికాసం, విద్యా వికాసం, విలువలను పెంపొందించే దిశలో కృషిచేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, బాలల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు.బాల్య వివాహాలు, బాల కార్మికులను నియంత్రించాలని బాలల హక్కులను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు.సమావేశములో జెడ్పిటిసి పుష్పలత, మండల స్పెషల్ ఆఫీసర్స్ సర్దార్ సింగ్, ఎంపీ ఓ శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ పూర్ణచందర్రావు, కంప్యూటర్ ఆపరేటర్ చరణ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గొంది రమణారావు, ఎంపీటీసీ గుడివాడ చంద్రశేఖర్, సర్పంచ్ మేనక, సరస్వతి, మల్లేశ్వరి, అనంత, దూల పురం సర్పంచ్ సాంబయ్య, వైస్ ఎంపీపీ అల్లి కమల, చైల్డ్ లైన్ డిస్టిక్ ఆఫీసర్ ఓంకార్, చైల్డ్ లైన్ అధికారిని మాదసీ నవీన, ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పలత, జగదాంబ, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ ములుగు రమేష్,కార్యనిర్వహణ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: