CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అదేర్య పడకండి ప్రభుత్వం ఆదుకుంటుంది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ..ముంపు గ్రామలకు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేసి అందిస్తుంది..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని గోదావరి వరద ముంపుకు గురైనటువంటి సున్నం బట్టి, పర్ణశాల గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు వరదల కారణంగా సున్నబట్టి నష్టపోయిన గ్రామను జరిగిన ఆస్తి నష్టాన్ని, కూలిపోయిన ఇళ్లను చూసి మంత్రి చలించిపోయారు బాధితులు మంత్రిని చూసి కన్నీరు పెట్టుకుని వారి గోడును వినిపించుకున్నారు ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ గోదావరి వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన సున్నం బట్టి గ్రామస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఎత్తైన ప్రదేశంలో ఇల్లు నిర్మించి ఇస్తామని తెలియజేశారు ఎవరు కూడా అదేర్యపడొద్దని ధైర్యంగా ఉండాలని నేను కూడా ఈ గోదావరి నీళ్లు పెరిగాను అని నేను మీ కుటుంబసభ్యులు ఒక మనిషిని ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు వరదల కారణంగా మండల అధికారులు చూపిన చొరవ అభినందనీయమని అధికారులను అభినందనలు తెలిపారు అలానే ప్రగళ్లపల్లి పంచాయతీ సెక్రెటరీ రాజేశ్వరి రాత్రి 3గంటలకు గోదావరి వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బందితో రక్షించినందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పర్యటనలో మండల సిపిఎం పార్టీ సభ్యులు వర్క్ షాపు, సున్నం బట్టి, ఏం కాశినాగారం గ్రామస్తులకు శాశ్వతంగా గోదావరి వరదలు ముంపు నుంచి పరిష్కారం చూపించి ఎత్తైన ప్రదేశంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మంత్రి వారి అభ్యర్థనకు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం నియోజవర్గం ఇంచార్జ్ డా. తెల్లం వెంకటరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, ఖమ్మం కలెక్టర్ విసి గౌతమ్, ఐటీడీఏ పీవో గౌతమ్, జిల్లా ఎస్పీ వినీత్, ఏఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ కిషోర్ బాబు, వివిధ శాఖల అధికారులు, దుమ్ముగూడెం పోలీస్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు..

Share it:

TS

Post A Comment: