CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజలందరు అప్రమత్తం గా ఉండాలి.అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు.కుడుముల లక్ష్మి నారాయణ

Share it:



మన్యం మనుగడ, మంగపేట.

రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంచెత్తుతున్న వరదలు, పొంగుతున్న వాగులు, వంకలు, సెల ఏర్లు, మత్తడి పోస్తున్న చెరువులు,కట్టలు తెగి మునిగి నీట మునుగి పోతున్న గ్రామాలు,మహోగ్ర రూపం ప్రదర్శిస్తున్న గోదావరి.... ఇటువంటి సమయం లో జనజీవనం అస్తవ్యస్తం గా మారింది. తెలంగాణా ప్రభుత్వం,అధికారులు,ప్రజా నాయకులు, ఎన్ జి ఓ లు అందరూ ఇప్పుడు ఉన్న పరిస్థితి ని చక్కదిద్దటానికి తమ సహాయశక్తుల కష్ట పడుతున్నారు, పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తూ, వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించే పనిలో అందరు నిమగ్నం అయి ఉన్నారు. ప్రజలందరూ కూడా మనవంతు బాధ్యత గా మీ మీ ఇండ్లలోనే ఉండి క్షేమంగా ఉండండి, ఇటువంటి ప్రమాదం పొంచి ఉన్న సమయాలలో పిక్నిక్ లు, విహార యాత్రలు, ప్రకృతిని ఆస్వాదించే పనిలో బాగంగా బయటకు వచ్చి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు, మీ కుటుంబంలోని సభ్యులకు జాగ్రత్త లు చెబుతూ మీరు అప్రమత్తత వహిస్తూ ప్రభుత్వానికి, అధికారులకు సహకరించగలరు అని మంగపేట మండలం తెరాస అధ్యక్షులు, మాజి ఎంపీటీసీ, సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ కోరారు.

Share it:

TS

Post A Comment: