CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగాకు ధన్యవాదాలు తెలిపిన మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాక్ బి' గ్రేడ్ గుర్తింపు పొందటానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను హైదరాబాదు నందు మర్యాదపూర్వకంగా కలిసిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. శ్రీనివాస్ విప్ రేగా కు పుష్ప గుచ్చం అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా నాక్ ఎకిడేషన్ పొందడానికి కళాశాలకు అవసరమైన అనేక సౌకర్యాలు అందించడం కోసం పూర్తిగా సహకరించడంతో పాటు అవసరమైన భవన నిర్మాణానికి సహకరించటం, అంతర్గత రోడ్డు నిర్మాణానికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే నిధుల నుంచి అనుమతి ఇచ్చి, నిర్మాణానికి సహకరించి నాక్ బి గ్రేడ్ సాధించడానికి కృషి చేయటం పట్ల ధన్యవాదాలు తెలిపారు.కళాశాల అభివృద్ధి కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని విద్యార్థుల సౌకర్యాలకు అవసరమైన అనేక ఏర్పాట్ల కోసం తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్ కు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు సాధించిన ఉన్నత ఫలితాల గురించి ఎమ్మెల్యేకు ప్రిన్సిపాల్ వివరించడం జరిగింది.

Share it:

TS

Post A Comment: