![]() |
మన్యం టీవీ దుమ్ముగూడెం:
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది మండల పరిధిలోని భారీ వర్షాలకు అనేక చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగులు వాగులు పారుతున్నాయి గుబ్బల మంగి వాక్కు వరద నీరు రావడంతో నిండుకుండలా ప్రవహిస్తుంది సి డబ్ల్యూ అధికారి రఘు తెలిపిన వివరాల ప్రకారం నిన్న నుంచి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల వరకు మండలంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. ప్రస్తుతం 50 అడుగుల నీటిమట్టం ఉంది 49 అడుగులు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు మూడు ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే ఉన్నాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలియజేశారు.తూరుబాక, గంగోలు గ్రామాల్లో ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుంది. గంగోలు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులను గోదావరి తో ముంపు గురికావడంతో స్థానిక ఎంపీటీసీ రత్నాకర్ రెవెన్యూ సిబ్బంది వెళ్లి వారితో చర్చించి పునరావాస కేంద్రాలకు తరలించారు. సున్నంబట్టి గ్రామంలో ఉన్న డొంక వాగు- దోమల వాగు పరిసర ప్రాంతం మొత్తం నీటి మునిగింది దీనితో సున్నంబట్టి గ్రామం నుండి రాకపోకలు అదనప కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించి నిలిపివేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల గోదావరి వద్ద సీతమ్మ విగ్రహం నారసిరాల ప్రాంతం నీట మునిగింది. పర్ణశాల గ్రామం కరెంట్ ఆఫీస్ వద్ద మోకాళ్ళ లోతు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా అధికారులు అంతకు అంతకు పెరుగుతున్న గోదావరి ఉధృతి వల్ల అలానే భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తునడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని దుమ్ముగూడెం తాసిల్దార్ చంద్రశేఖర్ దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని ప్రజల్ని కోరారు.
Post A Comment: