CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సుడిగాలి పర్యటన.కేంద్రం పెంచిన గ్యాస్ ధరల్ని తక్షణమే తగ్గించాలి.....

Share it:

 


• కేంద్ర వైఖరికిని నిరసిస్తూ జాతీయరహదారిపై ధర్నా..

. ప్రజావ్యతిరేక విధానాల్ని పార్లమెంటులో సైతం ఎండగడతాం..

మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: కేంద్ర ప్రభుత్వం సామాన్యు జీవితాలను తారుమారు చేసేలా పెంచిన గ్యాస్ ధరల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఖమ్మం

పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం కేంద్రం పెంచిన గ్యాస్ ధరల్ని నిరసిస్తూ జాతీయరహదారిపై చేసిన ఆందోళనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గ్యాస్ ధరల్ని నిరిసిస్తూ అన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ఆందోళన చేయటం జరిగిందన్నారు. అందులో భాగంగానే చండ్రుగొండలో సైతం ఆందోళన చేపట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దండయాత్రకు వచ్చిన్నట్లు తెలంగాణకు, వచ్చిన కేంద్ర ముఖ్యులు, బిజేపి నాయకులు ఇక్కడ సమస్యలపై పెదవి. విప్పలేదని, కేవలం ముఖ్యమంత్రిని, టిఆర్ఎస్పై ఆరోపణలు చేశారని విమర్సించారు.కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. కేంద్రం తప్పుడు విధానాలతో యువత, రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు రైతుబంధు, దళితబంధు, 24 గంటల కరెంటు సరఫరాతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. నేడు పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి వరంగా మారిందన్నారు. కేంద్రం విధనాలతో 13 నెలల పాటు రైతులు రహదారిపై ఆందోళనలు చేశారన్నారు. ఇకపై ప్రజల్లో, పార్లమెంటులో కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మేల్సీ తాతా మధు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి అధ్యక్షులు చండ్రుగొండ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దార వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఉప్ప తల ఏడుకోండలు. సయ్యద్ రసూల్ , దొడ్డ కుల రాజేశ్వరరావు, పైడి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: