CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి ముప్పు ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి.వాజేడు లో అత్యవసర సమావేశం నిర్వహించిన జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్

Share it:



  • గోదావరి ముప్పు ప్రాంతాలపై సర్పంచులకు, సెక్రెటరీలకు, దిశా నిర్దేశం చేసిన స్పెషల్ ఆఫీసర్.                    
  • ముప్పు ప్రాంతాలలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.                                  

                                               మన్యం మనుగడ వాజేడు జులై 6:తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై సర్పంచులకు,కార్యదర్శులకు, బుధవారం మండల అధికారులతో జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్ అత్యవసర సమావేశం ఎంపీడీవో అభివృద్ధి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.గోదావరి ముప్పు ప్రాంతాలలో సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఆదేశాలు జారీ చేశారు.తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని’’ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శులకు, సర్పంచ్లకు, సూచించారు.కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవండి. సహాయ శిబిరాలకు తరలించిన సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, జనరేటర్లు, జేసీబీలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో విజయ, ఎంపీ ఓ శ్రీకాంత్, జెడ్పిటిసి పుష్పలత, వాజేడు నాగారం సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: