CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొవిడ్‌ నుంచి బయటపడ్డాము.ఇప్పుడు సీజనల్‌ వ్యాధులతో పోరాడాలి:తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌రావు

Share it:


మన్యం టీవీ వెబ్ న్యూస్:


హైదరాబాద్‌: కొవిడ్‌ నుంచి బయటపడ్డామని.. ఇప్పుడు సీజనల్‌ వ్యాధులతో పోరాడాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌రావు అన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆహారం, నీరు కలుషితమైతే విష జ్వరాలు ప్రబలే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీహెచ్‌ సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో డీఎంహెచ్‌వోలతో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించి సన్నద్ధతపై ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు.


_దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు..


_‘‘బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్‌ వ్యాధులు వస్తాయి. వర్షాలు పడేసమయంలో అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి. కరోనాకు ముందు 2019లో వేలల్లో డెంగీ కేసులు వచ్చాయి. అప్పుడు కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1184 డెంగీ కేసులు వచ్చాయి. హైదరాబాద్‌లో 516, కరీంనగర్‌లో 84, కరీంనగర్‌లో 82, మహబూబ్‌నగర్‌లో 54, మేడ్చల్‌లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97.. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ డెంగీ కేసులు నమోదయ్యాయి. జూన్‌లో 563 కేసులు రాగా.. జులైలో తొలి 10 రోజుల్లోనే 222 కేసులు వచ్చాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల చర్యలు చేపట్టింది. దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం. దీన్ని పెంచాలని డీఎంహెచ్‌వోలకు ఆదేశాలిచ్చాం. మున్సిపల్‌, పంచాయితీరాజ్‌, వైద్య ఆరోగ్యశాఖల సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నాం. రెండు మూడు జిల్లాల నుంచి మలేరియా కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి, ములుగులోనే కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయి._


_ప్రజలు ‘ఫ్రైడే.. డ్రై డే’ చేపట్టాలి


_ఈ ఏడాది టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మేలో 2700, జూన్‌లో 2752 కేసులు వచ్చాయి. ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవడం ద్వారా ప్రజలు ఈ వ్యాధుల నుంచి సురక్షితంగా బయటపడొచ్చు. ప్రజలు ఫ్రైడే.. డ్రై డే కార్యక్రమం చేపట్టాలి. వేడివేడి ఆహారం తీసుకోవాలి. నీరు రంగుమారితే తప్పకుండా కాచి చల్లార్చి తాగాలి. జలుబు, జ్వరం, విరేచనాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్ట్‌ కిట్‌లు సిద్ధంగా ఉన్నాయి. గర్భిణిలు డ్యూ డేట్‌ కంటే ముందే ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకోవాలి. బాలింతలు, చంటి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఉండి మాస్క్‌ ధరిస్తూ ఐసోలేషన్‌ పాటించాలి._


_కొవిడ్‌ సీజనల్‌ వ్యాధిలా మారిపోయింది.. 


_గత ఆరు వారాలుగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరిగింది. కరోనా గురించి భయపడాల్సిన పనిలేదు. ఇది ఎండమిక్‌ దశకు చేరుకుంది. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలు ఉంటాయి. కొవిడ్‌ కూడా ఓ సీజనల్‌ వ్యాధిగా మారిపోయింది. లక్షణాలుంటే కేవలం 5 రోజులే క్వారంటైన్‌లో ఉండాలి. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు. డబ్ల్యూహెచ్‌వో కొత్త నిబంధనల ప్రకారం లక్షణాలు లేనివారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. కొవిడ్‌ సోకి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే ఆస్పత్రిలో చేరాలి. ప్రైవేట్‌ ఆస్పత్రులు అవసరం లేకుండా ప్లేట్‌లెట్‌ మార్పిడి చేయొద్దు. ప్రజల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవద్దు. అత్యవసంర అయితే ప్లేట్‌లెట్‌ చికిత్స అందించాలి’’ అని శ్రీనివాస్‌రావు అన్నారు._

Share it:

TS

Post A Comment: