CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేదల సంక్షేమమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం.

Share it:

 


దమ్మపేట జులై 08 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలంలో దమ్మపేట, కొమ్ముగూడెం, పట్వారిగూడెం, పార్లగండి గ్రామంలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కు ఆయన 73 వ జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అద్యక్షులు సోయం వీరభద్రం నేతృత్వంలో స్వగ్రామం కొమ్ముగూడెం, దమ్మపేట, పట్వారిగూడెంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అంతే గాకుండా వైఎస్ఆర్ టిపి మొదటి ఆవిర్భావ దినోత్సవ కూడా కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేసారు.

ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ,వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణలో ను ఎంతోమంది ప్రజలకు మేలు చేశారని ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులకు పోడు భూముల పట్టా లిచ్చి మేలు చేశారని అన్నారు.వైయస్సార్ తనయ వైయస్ షర్మిలమ్మ స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక వైయస్ షర్మిలమ్మ కూడా వైయస్ పరిపాలన అందిస్తారని పేదల సంక్షేమమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల అధ్యక్షుడు

నెట్ట రామకృష్ణ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి గంట వెంకటేశ్వరరావు తంకెళ్ళ ఏసుపాదం పానం ధర్మయ్య గోపాలరావు ప్రసాద్ శ్రీకాకుళం సత్యవతి పండూరిప్రసాద్

జోనిబోయిన సుబ్బారావు, ఎలికే నరసింహారావు స్వయం సత్యనారాయణ,నరసింహారావు బుద్ధ నాగబాబు,బీరవల్లి ప్రసాద్, కేసరి వీరస్వామి, స్వయం గోపి,ఓకే నరసింహులు జోగరావు,వాడే నరసింహారావు పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: