CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరావు డిమాండ్

Share it:


                        

 మన్యం మునగడ ప్రతినిధి,అశ్వాపురం : అశ్వాపురం మండలంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు సమగ్ర చట్టాన్ని సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి ఏర్పుల మల్లికార్జున్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు గురువారం ఉదయం మల్లెల మడుగు లోని రైతు వేదికలో నెల్లిపాక సొసైటీ డైరెక్టర్ కోడి పెద్ద వెంకన్న అధ్యక్షతన జరిగిన మొండికుంట మల్లెమడుగు ప్రాంత హమాలీ కార్మికుల సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగానికి అనుబంధంగా వివిధ వృత్తులలో ఎగుమతి దిగుమతి రైతుల వ్యవసాయ పంట కటాలు పెడుతూ వ్యవసాయ ఎగుమతుల లో రైతులకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం తో పాటు అసంఘటిత కార్మికులు సమగ్ర చట్టాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆవుల వెంకన్న గౌరవ సలహాదారులుగా సోలిపురం నర్సిరెడ్డి, అధ్యక్షులుగా కోడి పెద్దవెంకన్న ఉపాధ్యక్షులుగా ,సమకూరి శంకరయ్య, గొడుగు రవీందరు ప్రధాన కార్యదర్శిగా కమటంఎల్లయ్య, సహాయ కార్యదర్శులు గా మనది రామచంద్రు,పొడగంటి సురేష్ ప్రచార కార్యదర్శి గా ,తోట సాంబశివరావు,నల్లపాటి వెంకట,నరసయ్య కోశాధికారిగా తులసి ఆనందరావు, కార్యవర్గ సభ్యులుగా ఏర్పుల రామ్మూర్తి ,రెడ్డిరాజుల శ్రీకాంత్ ,అవనిగంటి సమ్మయ్య, తోట సాంబశివరావు, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు దంతాల జగదీష్, బొల్లం అయిలయ్య, కమటం శ్రీను, ఉండ్రాతి రామచంద్రు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: