CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వలస రాకలు ఎవరిని ఉద్ధరిద్దామని.సొంత నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ ?.వలసలు మీకెందుకో!.

Share it:


మన్యం మనుగడ,

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి :


పినపాక నియోజకవర్గంలో ముందెన్నడూ లేని అభివృద్ధిని నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన పాలనా కాలంలో చేశాడు. మారుమూల గ్రామాలకు సైతం రహదారుల ఏర్పాటు, వర్షాకాలంలో ఆదివాసీ జనం ఇబ్బంది పడకుండా వంతెనల నిర్మాణాలు, పంటలు సస్యశ్యామలంగా పండేందుకు చెక్ డ్యాముల నిర్మాణాలు, మణుగూరులో వంద పడకల ఆసుపత్రి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. రైతుబంధు , దళిత బంధు పేరుతో పేదల బ్రతుకులలో వెలుగులు నింపుతుంది టిఆర్ఎస్ పార్టీ. ఏది ఏమైనాప్పటికీ గతంతో పోలిస్తే పినపాక నియోజకవర్గం గత పాలకుల పాలనలో చిక్కిషల్యమైంది. రేగా కాంతారావు గత పాలకులు చేసిన తప్పు చేయకుండా, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన గత పాలకులు, వారి పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని, ఎంత చెబుతున్నా, ప్రతిపక్షాలు ఏదో సాధించాలని తపన. అన్న విధంగానే పార్టీ మారినప్పటికీ అభివృద్ధి పథంలోనే పినపాక నియోజకవర్గం నడుస్తుంది అని చెప్పక తప్పదు.


ఇతర పార్టీల నుండి చిన్నా చితక వలస నాయకులు పినపాక నియోజకవర్గానికి వచ్చి మేము పొడి చేస్తాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం, అని ప్రగల్బాలు పలకడం విడ్డూరం. సొంత నియోజకవర్గంలో చేయని అభివృద్ధిని, వలసవాదులుగా వచ్చి పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అనడం హాస్యాస్పదం. అధికార పార్టీలో ఉంటూనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వ్యక్తి, టిఆర్ఎస్ పార్టీ పెద్దాయనను కలవడానికి భయపడే వ్యక్తి నియోజకవర్గంలో ఉండడం సిగ్గుచేటని రేగా వాదన. నియోజకవర్గ ప్రజానీకానికి గతానికి , నేటికీ గల తారతమ్యాలు తెలుసు. పెద్దక్క కొడుకు నని, చిన్నన్న తమ్ముడు అని , నా వెనుక ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు అని చెప్పుకోవడం మానివేయాలని పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేగా హితవు పలికారు.ఇప్పటికైనా వలస రాకలు మానుకొని, నియోజకవర్గ జనాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని రేగా కాంతారావు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: