CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మారుమూల అటవీ ప్రాంత వరద ముంపు గ్రామాలను సందర్శించిన అడిషనల్ డీజీపీ...

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ::


గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించేందుకు అడిషనల్ డీజీపీ వై నాగిరెడ్డి దుమ్ముగూడెం మండలం మారుమూల అటవీ ప్రాంతమైన కాశీనగరం ముంపు గ్రామాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ,జిల్లా ఏస్పీ వినీత్, ఏఎస్పీ రోహిత్ తో కలసి సందర్శించారు. స్ధానిక ప్రజలలో మాట్లాడిన అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి వరద ఆనంతరం తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి అవసరమైన సహాయ చర్యల అందించేందుకు ముంపు ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. ప్రధానంగా వరద సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సదుపాయాలు సద్వినియోగం చేసుకొవాలని గ్రామస్తులకు సూచించారు. ఏ ఇతర సమస్యలు వున్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ , అదేవిధంగా ముంపు వల్ల జరిగిన నష్టాన్ని ,సమస్యలు నమోదు కోసం వచ్చే రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా స్ధానిక సమస్యపై తెలపాలని కోరారు. ఈ సందర్భంగా వరద ముంపు బాధితులు మాట్లాడుతూ గోదావరి వరదల వల్ల మాకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అలానే కుటుంబానికి మూడు సెంట్లు చొప్పున స్థలమిస్తే ఇల్లు కట్టుకొని జీవిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్, ఎస్సై రవికుమార్, కేశవరావు 

ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

Share it:

TS

Post A Comment: