CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రూపుల లొల్లితో కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారు -జేష్ఠ.-అశ్వారావుపేటకు వచ్చిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి అవమానం

Share it:

 


  •  -శ్రేణులకు కనీస సమాచారం లేదు
  • అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు జేష్ఠ వెల్లడి


 మన్యం మనుగడ, అశ్వారావుపేట:గ్రూపుల లొల్లితో కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకుపోవాల్సిన వారు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్నారని త్వరలోనే ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేష్ట సత్యనారాయణ చౌదరి తెలిపారు. ఒక గిరిజన ఎమ్మెల్యే హోదాలో, డిసిసి అధ్యక్షుడు, పిసిసి ఉపాధ్యక్షుడి హోదాలో మొదటిసారి నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటకు వచ్చినటువంటి పొదెం వీరయ్యకు సరైన పద్ధతిలో ఆహ్వానించకుండా, కనీసం ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయకుండా అవమానించారని వారన్నారు. జిల్లా అధ్యక్షుడు సెంటర్ కు వచ్చినప్పుడు కాంగ్రెస్ శ్రేణులు అనేకమంది సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనేక మంది ప్రజాప్రతినిధులందరికి సమాచారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన నాయకులు తన వాళ్లు అనుకున్న కొద్దిమందికి సమాచారం అందించి మిగిలిన వారిని విస్మరించారన్నారు. పదవులు కాపాడుకోవడం కోసం డిసిసి అధ్యక్షులను పావుగా వాడుకుంటున్నట్లుగా కనిపిస్తుందని, అందువల్లనే డిసిసి అధ్యక్షులు అసహనం వ్యక్తం చేశారని వారన్నారు. దేశం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంటే అశ్వరావుపేటలో మాత్రం గ్రూపుల లొల్లితో అబాసు పాలు అవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చే ఈ తరుణంలో గ్రూపులను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ప్రజలందరికీ వివరించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన ఈ సందర్భంలో పార్టీని బ్రష్టు పట్టించడం సరికాదన్నారు. ఇప్పటికైనా గ్రూపులతో కొట్టుమిట్టాడుతున్న నాయకులు అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికై అడుగులు వేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా పని చేయాలని వారు హితవు పలికారు.

*కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లో గ్రూపుల లొల్లి*

మొదటిసారి అశ్వారావుపేటకు వచ్చిన డిసిసి అధ్యక్షులు, భద్రాచలం గిరిజన ఎమ్మెల్యే పొదేం వీరయ్య కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, డిసిసి అధ్యక్షులు అశ్వారావుపేటకు వస్తే కనీసం మాకు సమాచారం అందించరా, కనీసం మమ్మల్ని పరిచయం కూడా చేయరా అంటూ కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఊట్లపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సత్యం రామకృష్ణ, అశ్వారావుపేట మొదటి సెగ్మెంట్ ఎంపీటీసీ వేముల భారతి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకి విలువ లేకుండా చేస్తున్నారని, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళని వెంటేసుకుని తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, డిసిసి అధ్యక్షులు పట్టణానికి వస్తే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని విలేకరుల సమావేశంలోనే నిలదీశారు. దీంతో పొదెం వీరయ్య అసహనం వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశాన్ని సైతం అర్దంతరంగా ముగించారు. దీంతో విలేకరుల ముందే కార్యకర్తలు తమ ఇష్టం వచ్చినట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సమావేశం ముగించుకొని బయటకు రాగానే రోడ్డుపైన కూడా ఇదే విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అంది వచ్చిన అవకాశాన్ని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో వస్తున్న స్పందనను సద్వినియోగం చేసుకోవలసిన ఈ తరుణంలో ఈ గ్రూపుల లొల్లి ఏంటి అంటూ కార్యకర్తలు,గుసగుసలాడుకున్నారు.

Share it:

TS

Post A Comment: