CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్న యూ న్యూస్ ఛానెల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

 అనునిత్యం ప్రజా సేవ చేస్తున్న ములుగు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తు అసత్య ప్రచారాలు చేస్తున్న యూ న్యూస్ ఛానెల్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమన్న ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.ప్రజల కష్టాలలో పాలు పంచుకొంటూ కరోన కాలం లోను సైతం ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఎనలేని సేవలు అందించిన సీతక్క పై ఆరోపణలా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు,నదులు పొంగి జనజీవనంస్థంభించినపుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల బాగోగులు చూసింది ఎమ్మెల్యే సీతక్క కాదా,లోతట్టు ప్రాంతంలోని గ్రామాల్లో ప్రాణ నష్టం కలగకుండా అధికారులతో 24 గంటలు ఉండి తన వంతుగా సాయం చేస్తూదాతల ద్వారా విరాళాలు సేకరించి అన్నార్థుల ఆకలి నింపుతున్న తల్లి సీతక్క కాదా,రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత శాసనసభకు ఎన్నుకోబడిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ,అను నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారు,రాజకీయాలకు అతీతంగా సేవాకార్యక్రమాలు చేస్తున్న ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రతిక్షణం ప్రజల మధ్య ఉంటున్న ఆదివాసి ఎమ్మెల్యే , పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చిలుక ప్రవీణ్ ని , కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తి గత విలువలు ప్రతిష్టను కించపరుస్తున్న యూ న్యూస్ రిపోర్టర్ చిలక ప్రవీణ్,మొగుళ్ల భద్రయ్య పై చర్యల వెంటనే తీసుకోవాలి లేదంటే జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని జిల్లా ఎస్టీ అధ్యక్షుడు గుమ్మడి సోమన్న హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు మైబూబ్ ఖాన్, మండల ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయ్యోరి యన్నయ్య,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చదా మల్లన్న,సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్దబత్తుల జగదీష్,యూత్ మండల అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్,యూత్ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి ముకుందాం,భూర్గుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: