CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీలను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహిస్తున్న తెలంగాణా ప్రభుత్వం.--:ఐటీడీఏ జిల్లా పేసా కోఆర్డినేటర్ కొమురంప్రభాకర్

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలను మత్య్స పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సాహాం ఇవ్వడం జరుగుతుందని,తెలంగాణా రాష్ట్ర ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలు ఎక్కువగా ఉపయోగించుకోవలని,ఐటీడీఏ పేసా జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ అన్నారు.

ములుగు జిల్లాలోని 112 ఏజెన్సీ గ్రామ పంచాయతీలలో మత్య్స పారిశ్రామిక సొసైటీల నిర్మాణం కొరకు ఈరోజు కన్నాయిగూడెం మండలంలోని కన్నాయిగూడెం మండలం రాజన్నపేట గ్రామాలలో చేపలు పట్టే విధానం పై వివిధ పరీక్షలు నిర్వర్తించమని ఈ యొక్క పరీక్షలలో సభ్యులు అందరు కూడా మంచి ఫలితాలు సాధించారని మత్య్స సొసైటీల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ప్రతి గ్రామంలోని చెరువులకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉచిత చేప పిల్లలు 60% రాయితీ తో వలలు,తెప్పలు,అమ్మకపు ఆటోలో,మోటార్ సైకిల్,

సైకిళ్ళు,శీతలీకరణ యంత్రాలు మొదలగునవి ఇస్తూ అదేవిధంగా సభ్యులకు ప్రమాద భీమా 5లక్షలు అంగవైకల్యం చెందిన సభ్యులకు 2 లక్షల భీమా ప్రభుత్వం నుండి కల్పించ బడుతున్నాయని,మత్య్స శాఖ జిల్లా అధికారి పిల్లి శ్రీపతి మీడియాకు తెలిపారు. అదేవిదంగా ఈయొక్క పరీక్షలకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కన్నాయిగూడెం సర్పంచ్ అల్లెం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ చిరుధాన్యాల జిల్లా కోఆర్డి నేటర్ దబ్బగట్ల సుమన్ మత్య్స క్షేత్ర అధికారి పాముల రమేష్, సిబ్బంది కృష్ణ కన్నాయిగూడెం,రాజన్నపేట గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: