CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి వరద ఉదృతని పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.ఎడతెరపి లేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:విప్ రేగా కాంతారావు

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, చిన్నరాయి గూడెం, కొండాయిగూడెం,గ్రామాలలో గోదావరి నది ఉదృతని సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,ప్రజా ప్రతినిధులు, పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.నైరుతి రుతుపవనాలు ప్రభావంతో రాష్ట్రమంతటా రానున్న 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిచ్చిందని ఆయన తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలుచోట్ల వాగులు, వంకలు,వరద నీటితో పోటెత్తుతున్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.రెవిన్యూ,పోలీస్, విద్యుత్ శాఖలు సమన్వయం తో,24 గంటలపాటు ప్రజల అందుబాటులో ఉండాలని సూచించారు.భారీ వర్ష సూచన ఉన్నందువల్ల ప్రజలు ఎవరు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.వాగులు,వంకలు,చెరువులు,కుంటలు పూర్తిస్థాయిలో నిండినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు లోతట్టు ప్రాంతాలవారీగా అప్రమత్తం చేసి తగిన చర్యలు చేపట్టాలన్నారు.ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో సహాయ చర్యలలో పాల్గొనాలని కోరారు.మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు.వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,తహశీల్దార్ నాగరాజు,సిఐ ముత్యం రమేష్,మున్సిపల్ కమిషనర్ మాధవి,ఎంపీడీవో వీరబాబు, ఎంపిఓ వెంకటేశ్వర్లు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు,పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: