CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ::

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల చెరువులు నిండి, వాగులు కాలువలు వరదలతో రోడ్లను సైతం ముంచెత్తుతున్న సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ దుమ్ముగూడెం మండల కన్వీనర్ సరియం భీమ్ మండల ప్రజలకి కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా పెద్ద వాగుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర అవసరాలకు మాత్రమే ప్రయాణాలు చేయవలసిందిగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేపించుకోవలని మండల ప్రజలను కోరడం జరిగింది. ఈ మధ్య గుబల మంగమ్మ వాగులో జరిగిన ఘటన చాలా బాధాకరమని, అలాంటివి జరగకుండా మనమే తగు జాగ్రత్తలు పాటించాలని, అలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే సంభదిత అధికారులను సంప్రదించాలని పిలుపునిచ్చారు. వరద సహాయక బృందాలు అందుబాటులో లేనియెడల మండలం లోని పోలీస్ వ్యవస్థ అవసరం కొరవల్సిందిగా ప్రజల్ని కోరడం జరిగింది. అన్ని వేళలా బహుజన్ సమాజ్ పార్టీ దుమ్ముగూడెం మండల కమిటీ ప్రజశ్రేయస్సు కై అందుబాటులో ఉంటామని సహాయక చర్యల నిమిత్తం అవసరమైతే ఈ నంబర్ (8096015100) కి కాల్ చేసి, వాట్సాప్ సమాచారాన్ని అందించిన వస్తామని తెలిపారు.

Share it:

TS

Post A Comment: