CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే లేదంటే ప్రతిఘటన తప్పదు.సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్...

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం :: గోదావరి వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సున్నం బట్టి గ్రామాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మండల నాయకుల బృందంతో సందర్శించారు. ప్రతి ఇంటిని సందర్శించిన అనంతరం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనని లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు గ్రామంలో 130 ఇల్లు ఉంటే సగానికిపైగా కూలిపోవడం ఉన్నటువంటి ఇల్లు కూడా ఎప్పుడు కూలిపోతాయి కూడా తెలియని పరిస్థితిలో సున్నం బట్టి గ్రామస్తులు ఉన్నారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి ప్రకటించిన పదివేల రూపాయలు సర్వం కోల్పోయిన ఇళ్లలో పనిచేసే కూలీలకు కూడా చరిపోవని ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనని పాక్షికంగా నష్టపోయిన ఇంటికి 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం మండలంలో అనేక గ్రామాలలో భారీ వర్షాల వలన గోదావరి ముంపు గురై నటువంటి అన్ని కుటుంబాలకు ఎత్తయిన ప్రదేశంలో ఇల్లు కట్టి ఇవ్వాలని భవిష్యత్తులో సీతమ్మ ప్రాజెక్టు వలన గాని పోలవరం ప్రాజెక్టు వలన గాని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా దుమ్ముగూడెం మండలంలో లో ఎలమంచిలి సీతారామయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 12వ తేదీ నుంచి మొదలుకుని ఇప్పటివరకు అన్నదాన కార్యక్రమాలు అల్పాహారం మంచినీళ్ల సౌకర్యం ఇలా అనేక సహాయ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయ కార్యక్రమాలు చేపట్టడం కోసం దాతలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుమ్మగూడెం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బ్రహ్మచారి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్రయ్య, చిలకమ్మా, ఎలమంచిలి సీతారామయ్య కన్వీనర్ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎలమంచి శ్రీనుబాబు, బోల్లి సూర్యచందరావు, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: