CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట కెవిఆర్ ఫంక్షన్ హాల్ నందు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.పినపాక నియోజకవర్గం లో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నిధులకు కొరత లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.పినపాక నియోజకవర్గం లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు , గ్రామాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతున్నారు.సీఎం కేసీఆర్ పేదల సంక్షేమ అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పథకం గడపగడపకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నదని అన్నారు, కెసిఆర్ కిట్ పేరుతో అమ్మాయి పుడితే 13 వేల రూపాయలు, అబ్బాయి పుడితే 12 వేల రూపాయలు అందిస్తూ వీటితోపాటు 15 రకాల వస్తువులతో కెసిఆర్ కిట్ ను అందిస్తున్నామన్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రు.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది అలా అందించిన ప్రభుత్వ సహకారంతో రకాల వివిధ వ్యాపారాలను చేసుకుని జీవితంలో ఎదగాలనే సంకల్పంతో తోడ్పాటు ను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు. గత ప్రభుత్వాలు గత పాలకుల చేయని అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్న అన్నారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సంబడ వర్గాలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆయన అన్నారు.ఆసరా పింఛన్, రైతుల కోసం రైతు బందు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ పేదలకోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే సీఎం కెసిఆర్ లక్ష్యమని అన్నారు.సమైక్య పాలనలో దండగన్న వ్యవసాయాన్ని రైతు అనుకూల విధానాల అమలు ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం పండగగా చేస్తున్నదన్నారు.జనాభాలో 60 శాతం మందికి ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు.ప్రతి కార్యకర్తను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పల కాపాడుకుంటుందని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై కొన్ని దృష్టి దుష్టశక్తులు అసత్య ప్రచారాలు చేస్తూ,బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వాటిని తిప్పుకొట్టాలన్నారు.అందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తానని ఆయన అన్నారు, జిల్లాలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ , టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి వేగవంతంగా కృషి చేస్తానని ఆయన అన్నారు.ప్రభుత్వానికి పార్టీకి మధ్య తాను వారధిగా ఉంటునని మీ సహకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు.అంతేకాకుండా మన ఊరు మనబడి కార్యక్రమంతో ఉన్నటువంటి పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించబడుతున్నాయని ఆయన అన్నారు, ఇప్పటికే అన్ని పాఠశాలలను ఆధునికరణ జరుగుతున్నదని దీనికోసం రూ.7,285 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.టిఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత పాఠశాలలను బలోపేతం చేస్తున్నారన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, నాయకులు, మండల యువజన నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: