CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా స్వచ్ఛ విద్యాలయం పురస్కార్ అవార్డులు అందజేత.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, బూర్గంపహాడ్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డ్స్ 2021-2022 సంవత్సరంల గాను బూర్గంపహాడు, దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల్లో పాఠశాలలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదగా 7 పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఎంపికైన 37 పాఠశాలలకు గాను ఐటిసి ఎం ఎస్ కే వాష్ ప్రోగ్రాం ద్వారా పాఠశాలలకు మౌలిక వసతులు కల్పనలో 7 పాఠశాలకు అవార్డులు రావడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాఠశాల యాజమాన్యం కమిటీలు చేసిన కృషిని అభినందించారు. పాఠశాల,ప్రధానోపాధ్యాయులకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారు అవార్డ్స్ లను జిల్లా కలెక్టర్ చేతుల మీదగా అందించారు.వారికి సహకరించిన ఐటిసి ఎం ఎస్ కే వాష్ ప్రోగ్రాం వారి కృషిని ప్రశంసించారు.బూర్గంపాడు మండలంలో జడ్పీహెచ్ఎస్ మొరంపల్లి బంజర,ఎం పి పి ఎస్ అంజనాపురం,ఎం పీ పీ ఎస్ జింకలగూడెం,ఎం పి యు పి ఎస్ సోంపల్లి,అదేవిధంగా దుమ్ముగూడెం ఎం పీ యూ పీ ఎస్ రామారావుపేట,ఎం పి యు పి ఎస్ బండారిగూడెం, అశ్వాపురం మండలం ఎం పి యు పి ఎస్ రామచంద్రపురం పాఠశాలల,ప్రధానోపాధ్యాయులకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వెంకటేశ్వర్లు,కిషన్,వెంకటేష్, శాంతారావు,నాగయ్య,శ్రీనివాస్,సత్యనారాయణ,ఐటిసి ఎం ఎస్ కే మేనేజర్ జయప్రకాష్, వాష్ ప్రోగ్రాం ఇంజనీర్ సుబ్బయ్య,ఏపీవో సునీల్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: