CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు ఎమ్మెల్యే సీతక్క పై అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎస్సీ సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి దీగొండ కాంతారావు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు చినపెళ్ళి రాంబాబు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో ఎస్సీ సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి కాంతారావు హాజరై మాట్లాడుతూ  

  గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క పై అసత్య ప్రచారాలు చేస్తూ సీతక్క కీర్తిని చూసి ఓర్చుకోలేని కొందరు వ్యక్తులు సీతక్క ఖ్యాతిని దెబ్బతీయడానికి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారందరికీ మేము చెప్పేది ఒక్కటే సీతక్క చేసిన సేవలకు దేశం మొత్తం కొనియాడుతుంటే మీరు చేసేదేమీ లేక మీ అక్కసు వెళ్ళగక్కుతున్నారు నిజంగా మీకు చేతనైతే దమ్ము ఉంటే ప్రజా క్షేత్రం లో పని చేయండి, నిరూపించుకోండి అంతే కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు పారదర్శకంగా పని చేసే ప్రజా ప్రతినిధి పై నిందలు వేయకండి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకండి, లేదా రండి బహిరంగ చర్చకు నేను సిద్ధం మీరు కూడా సిద్ధమైతే రండి. సీతక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా, ప్రశ్నించే గొంతుకగా ప్రజల కష్ట, నష్టాల్లో తోడుగా ఉంటూ అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ, అను నిత్యం ప్రజల పక్షాన నిలిచే సీతక్క పై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. సీతక్క కరోన కాలంలో, వరదల సమయంలో తను చేసిన సేవ దేశానికే ఆదర్శనీయం అని, అలాంటి సీతక్క కీర్తి, గౌరవ మర్యాదలు చెడగొట్టడానికి కొందరు వ్యక్తులు సీతక్క ని లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీతక్క భూకబ్జాలు చేసిందని అసత్య ప్రచారాలు చేసే సన్నాసులు ఎక్కడ, ఎప్పుడు చేసిందో, ఎవరి భూములు కబ్జా చేసిందో చెప్పడానికి బహిరంగ చర్చకు రావాలనిఈ సందర్బంగా ధీగొండ కాంతారావు వారికి సవాల్ విసిరారు. ఇంకొకసారి ప్రజల మనిషి సీతక్క పై తప్పుడు ఆరోపణలు చేసిన, అసత్య ప్రచారాలు చేసిన ఊరుకునేది లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండలప్రధానకార్యదర్శి మైప లాలయ్య, గ్రామకమిటి ప్రధానకార్యదర్శి బోడ బోర్రయ్య గారు, మండల నాయకులు బసారి నాగార్జునగారు, యస్ సి సెల్ మండల ప్రధానకార్యదర్శి దుర్గం శివప్రసాద్,

 యుత్ నాయకులు బోడ జయరాజ్ గారు, యస్ సి సెల్ గ్రామ కమిటి అద్యక్షులు గోనె నగేష్, బోడ అనిల్, కాంగ్రెస్ పార్టీ బాలన్నగూడెం గ్రామ అద్యక్షులు తొలెం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: