CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పటిష్ఠంగా పోషణ్‌ ట్రాకర్‌ .అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం పారదర్శక పంపిణీకి ప్రతిబింబం

Share it:

 



★ ట్రాకింగ్‌ పరిధిలో 35,700 కేంద్రాలు


★ డ్యాష్‌ బోర్డుతో నిత్య పర్యవేక్షణ


మన్యం టీవీ వెబ్ న్యూస్:


తెలంగాణ రాష్ట్రం లోని

చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణ.. నిరంతర పర్యవేక్షణ కోసం రూపొందించిన పోషణ్‌ ట్రాకర్‌ విధానాన్ని ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేస్తున్నది. రాష్ట్రంలో 149 ప్రాజెక్టుల పరిధిలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందించే పౌష్టికాహార పంపిణీ పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ విధానంతో అన్నిస్థాయిల్లో అక్రమాలకు చెక్‌పెట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి, చిన్నారులకు బాలామృతం, బాలామృతం ప్లస్‌ వంటి పథకాల అమలులో పోషణ్‌ ట్రాకర్‌ కీలకంగా మారింది. ఈ విధానాన్ని అనుసరించడంలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ఏ అంగన్‌వాడీ కేంద్రంలో ఎంతమంది లబ్ధిదారులున్నారు? వారికి పోషకాహారం సమయానికి అందుతున్నదా? లేదా? వంటి వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లోని డ్యాష్‌బోర్డు పర్యవేక్షించేలా ఏర్పాటుచేశారు.


అందాజా లెక్కలకు స్థానం లేదు


అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఇప్పటి దాకా కొనసాగిన ఉజ్జాయింపు లెక్కలకు సర్కార్‌ మంగళం పాడింది. పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటి దాకా లబ్ధిదారుల డాటా, వారికి పంపిణీ చేసే పౌష్టికాహార వివరాలు గతంలో ఇష్టారీతిగా ఉండేవి. పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరిగేది. ఇలాంటి జాడ్యాలను, నిర్లక్ష్యానికి చెక్‌పెట్టి ప్ర భుత్వ ఫలాలు పొందే వేదికగా అంగన్‌వాడీ కేంద్రాల ను నిర్మించాలన్న సర్కారు ఆలోచనలకు అనుగుణంగా ఈ ట్రాకర్‌ను రూపొందించారు.


పోషణ్‌ ట్రాకర్‌- రాష్ట్రం ప్రత్యేకం


పోషణ్‌ ట్రాకర్‌లో తెలంగాణ జాతీయస్థాయిలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకొన్నది. అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులందరికీ గ్రోత్‌ మానిటరింగ్‌ కార్డులు ఎదుగుదల పర్యవేక్షణ జారీ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పింది. పోషణ్‌ ట్రాకింగ్‌లో చిన్నారుల ఆధార్‌ లింక్‌ పేర్లతో సహ చేసిన తొలి రాష్ట్రం కూడా తెలంగాణనే అని పోషణ్‌ ట్రాకర్‌ పర్యవేక్షులు పేర్కొన్నారు.


35,700 మొబైల్‌ ఫోన్లు


రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం మొబైల్‌ ఫోన్లను అందించింది. పోషణ్‌ ట్రాకర్‌ను ఎప్పటికప్పుడు.. ఏ రోజుకారోజు ఎలా అప్‌లోడ్‌ చేయాలి? వంటి అంశాలపై అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌, సీడీపీవో, అంగన్‌వాడీ టీచర్‌/ఆయాలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ శిక్షణ ఇచ్చింది. అం గన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు ఎంతమంది? వారి ప్రసూతి సమయం ఎప్పుడు? వంటి వివరాలు పోషణ్‌ ట్రాకర్‌లో నమోదయ్యాయి.


ఒక అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణిగా నమోదైన తేదీ నుంచి ప్రసూతి నిర్దేశిత గడువు ఆధారంగా ఆటోమెటిక్‌గా బాలింతల జాబితాలోకి వెళ్లిపోయేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిల్లల వయసులవారీగా నిర్దేశిత గడువులోగా క్యాటగిరీ ఉదాహరణకు 0-6 నెలల వరకు ఉన్న పిల్లల క్యాటగిరీ గడువు పూర్తి కాగానే 6 నెలల నుంచి 3 ఏండ్ల క్యాటగిరీకి ఆటోమెటిక్‌గా పోషణ్‌ ట్రాకర్‌ మార్చేస్తుంది. మారేలా ట్రాకరే చూసుకుంటుంది. ఆయా క్యాటగిరీల కింద ప్రభుత్వం నుంచి అందే పోషకాహారం ఇండెంట్‌లోనూ మార్పులు జరిగిపోతాయి.

Share it:

TS

Post A Comment: