CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముంపు గ్రామాలను, లోతట్టు ప్రాంతాలను పునరావాస కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క.

Share it:



మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండల కేంద్రములోని లోతట్టు ప్రాంతాలను గోదావరి ముంపు గ్రామాలను పునరావాస కేంద్రాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సందర్శించి భాదితులను పరామర్శించారు. అనంతరం వారిలో కొందరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కమలాపురం నుంచి అకినేపల్లిమల్లారం వరకు ఉన్న తీరప్రాంత గ్రామాల రక్షణకు,పంటభూములు కోతకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే

కరకట్ట నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆమె కోరారు.గోదావరి వరద ప్రవాహ ఉద్రిక్తత, ఒరవడి వలన తీరప్రాంతoలోని పొదుమూరు మంగపేట,కమలాపురం,బోరునర్సాపురం,మల్లూరు,చుంచుపల్లి,పాలయిగూడెం,దేవనగరం, వాడగూడెం,రమనక్కపేట,కత్తిగూడెం, అకినేపల్లి మల్లారం గ్రామాలకి చెoదిన వందలాదిమంది రైతాంగం సాగు చేసుకుంటున్న వేలాదిఎకరాల విలువైన మెట్ట,వాణిజ్యపంటలు పండే భూములు యేటా కోతకు గురై రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.భారీవర్షాలు,వరదల వల్ల నార్లు, ప్రాథమిక దశలోని పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులకు తక్షణమే

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు.అనంతరం

మంగపేట పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద ఉదృతిని ఎమ్మెల్యే అధికార యంత్రాంగం తో కలసి పరిశీలించారు.గోదావరి నది ఒడ్డు తీరం వెంబడి

కరకట్ట నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ,137 కోట్లు మంజూరు చేసినప్పటికీ,ఏడాది కాలంగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదని ఆమె మండిపడ్డారు. గత 8 యేండ్ల నుండి కరకట్ట నిర్మాణ పనులకు టెండర్లుజరుగుతున్నాయి కానీ పనులు కావట్లేదని, రాష్ట్ర ప్రభుత్వం రూ, 137 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనుల్లో అతి, గతి లేదని గోదావరి వరద ఉదృతి వలన గ్రామాలకు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని,ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన రివిటి మెంట్ పనులు ప్రారంభించాలి నష్ట పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎడతెరిపి లేని వానలతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది,

గోదావరిలో క్రమేణా పెరుగుతున్న నీటి ప్రవాహంలోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని

జిల్లా,మండల అధికారులు సహాయక చర్యలు మరింత ముమ్మరం చెయ్యాలని

గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందని, ప్రజలు ఎవ్వరూ వ్యవసాయ పనులకు,చేపలు పట్టేoదుకు బయటకు రాకుండా ఉండాలని ఆమె హెచ్చరించారు. ములుగు నియోజక వర్గం లో వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయని, కాజువేలు, వంతెనల మీదుగా వరద నీరు పోతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, పక్కనే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి గోదావరిలోకి వరుద నీరు చేరి గోదావరి ఉదృతిగా ప్రవహిస్తుంది అని

ముఖ్యంగా గోదావరి పరివహా ప్రాంతాలు ఏటూరు నాగారం, మంగపేట,కన్నాయిగూడెం, తాడ్వాయి,వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఆమె సూచించారు.ఆయా ముంపు,లోతట్టుప్రాంతాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని వరద నీరు ఇళ్లలోకి చేరకుండా ఆదుకోవాలని సీతక్క కోరారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో ప్రమాదకరంగా ప్రవహిస్తుందని,ఎగువ నుండి వరద పోటెత్తుతుండటంతో గోదావరి నది ప్రవాహం క్రమేణా పెరుగుతుందని, ఏకధాటి వానతో ములుగుతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుందని, దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో తమ యంత్రాంగాన్నీ అలర్ట్ ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారని సీతక్క అన్నారు.ఆమె వెంట పార్టీ

జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మంగపేట మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,చిటమట రఘు,బిసి సెల్ జిల్లా ప్రదాన కార్యదర్శి పెద్దినర్సింహారావు,వావిలాల చిన్న ఎల్లయ్య, ఎండి. ఖలీల్ ఖాన్,ఎండీ రియాజ్,కట్కురి రాధిక,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు

ఎండీ గౌస్,మేడిపెళ్ళి వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్సార్ ఖాన్, మండల పార్టీ ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిట్టమట రఘ,యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ,మైనార్టీ సెల్ అధ్యక్షులు హిదాయుతుల్ల, సీతక్క యువజన మంగపేట మండలం అధ్యక్షులు సిద్ధ బత్తుల జగదీష్ , మెహబూబ్ ఖాన్ , పోదెమ్ నాగేష్, చెట్టిపల్లి వెంకటేశ్వర్లు,సతీష్, యూత్ నాయకులు ,నర్ర కిషోర్, కోడెల నరేష్, బోడ సతీష్, గద్దల సాయి, కాయం సంతోష్,

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: