CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన చట్టాలను పట్టించుకోని ఎమ్మెల్యేలు -మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

తెలంగాణ రాష్ట్రంలో గిరిజన చట్టాలను పట్టించుకోకుండా తుంగలో తొక్కుతున్నారని, మన్నె సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య అన్నారు. ఆదివారం మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ని బెల్లి విష్ణు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏరియాలో 1 ఆఫ్ 1959,1ఆఫ్ 1970, పేసా ఆక్ట్ 2011 గిరిజన చట్టాలు అమలుకై గిరిజనేతరులు ఓసి, బిసి,ఎఫ్ సి కులాల భవనములను అక్రమ ఇళ్ల నిర్మాణాలను జెసిబి లతో తొలగించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూలు ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పిఓ ఐఏఎస్ కు మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర తప్ప మిగతా గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు గిరిజన అభివృద్ధి గురించి పనిచేయడం లేదని, గిరిజన చట్టాల అమలకై గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గిరిజనేత్రుల కొరకు చట్టాలకు విరుద్ధంగా వారు అభివృద్ధి కొరకై పనిచేస్తున్నారని ఏ ఒక్క గిరిజన ఎమ్మెల్యేలు కూడా గిరిజన ప్రజలను తమ దగ్గరికి రానివ్వడం లేదని ఈ సందర్భంగా గొప్ప వీరయ్య అన్నారు.గిరిజన చట్టాలైన 1/59,1/70, పేసా అమల కొరకు సుమారు 70 సంవత్సరముల నుండి అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడల్లా ఏ ఒక్క గిరిజన ఎమ్మెల్యే లు,ఎంపీ లు గాని మాట్లాడిన దాఖలు లేవని,గిరిజనులు సారవంతమైన భూములను గిరిజనేతరులకు కొంతమంది ఎమ్మెల్యేలు,ఎంపీలు బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించి అప్పగిస్తున్నారని, అంతేకాకుండా గిరిజన భూములలో సాగు చేసుకుంటున్నా అక్రమ నిర్మాణాలు కలిగి ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయించి గిరిజనులకు అప్పగించాలని గొప్ప వీరయ్య కోరారు.ఈ సమావేశంలో మన్య సీమ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు జబ్బ సమ్మయ్య,ఈసం యాదయ్య, ములుగు జిల్లా అధ్యక్షులు ఈసం రాజు,పొడెం శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: