CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆగస్టు 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి.ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలి.

Share it:

 


  • భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలి.
  • తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.
  •  కొత్తగా పంటలు వేసుకోవ డానికి విత్తనాలు,ఎరువులు,
  • ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలి.
  • కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 5 న కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం.
  • కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,ముంపు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి.
  • కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావే శంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.ములుగు నియోజక వర్గంలో భారీ వర్షాలు,గోదావరి నది వరద ప్రవాహంతో ఏర్పడ్డ పరిస్థితులతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.వందలాది ఇళ్లు వరద ముంపులో మునిగి పోయాయని, నీట మునిగి పోయిన బాధిత కుటుంబాలకు తక్షణ సాయం క్రింద ఇస్తానని చెప్పిన 10 వేల తో పాటు డబుల్ బెడ్ రూం లు మంజూరు చేయాలని 

 రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరదలు,అకాల వర్షాలకు పంట నష్టం జరగడం పరిహారం అందక రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పరిపాటిగా మారిందనీ అన్నారు.రాష్ట్రంలోప్రకృతి విపత్తులు, భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతుంటే వారిని ఆదుకునే పథకం ఏదీ కూడా ప్రభుత్వం వద్ద లేకపోవడం అత్యంత దారుణమైన విషయంఇది రైతుల పట్ల మీ కపట ప్రేమకు నిదర్శనం.2015 నుంచి పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ ఇవ్వడం మానేసింది.పంట నష్టం సైతం అంచనా వేయడం లేదుభారీ వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు నష్టపోతుంటే కేసీఆర్ సర్కారుకు ఏమాత్రం సోయి లేదని మండిపడ్డారు.నష్టాన్ని అంచనా వేయడానికి తక్షణం బృందాలను పంపాలన్నారు. ఎకారకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు.అదే విధంగా ఆగస్టు 5 న టిపిసిసి ఆదేశాల మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల,

అధ్యక్షులు అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు ప్రజా ప్రతినిధి లు బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,ఇరుస వడ్ల వెంకన్న,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్

ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వేంకటా పూర్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్

ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వాకిటి రామ కృష్ణ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మైస ప్రభాకర్,

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి కుమార్,ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,సర్పంచులు రత్నం భద్రయ్య,పసుల సాంబయ్య,ఈక కృష్ణ

మాజీ మండల అధ్యక్షులు కొంపెళ్లీ శ్రీనివాస్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,హట్కర్ స్వామీ,

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: