CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కెసిఆర్ కిట్ అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్.

Share it:


మన్యం టివి మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని శనివారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ సందర్శించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి నందు డెలివరీ అయిన మహిళకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కెసిఆర్ కిట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అందజేశారు.ఈ సందర్భంగా విప్.రేగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యకర సమాజాన్ని తీర్చేదెందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నది అని తెలిపారు. నిరుపేద కుటుంబాల కు చెందిన గర్భిణీలు నెలలు నిండాక పనులు చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు అన్నారు. సర్కార్ దవఖానలలో ప్రసవాలు చేయించుకునే వారికి కెసిఆర్ కిట్ పథకం ద్వారా 16 రకాల వస్తువులతో కూడిన బ్యాగును ఇవ్వడంతో పాటు, ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం అని తెలిపారు.ఈ పథకం ద్వారా సమర్ధంగా నిర్వహిస్తున్న కారణంగా రాష్ట్రంలోని సర్కార్ దవాఖానాలలో ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,హాస్పిటల్,సూపరింటెండెంట్ గిరి ప్రసాద్, ఎంపీటీసీ సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు,స్థానిక సర్పంచ్ బచ్చల.భారతి,మండల ప్రజాప్రతినిధులు,మండల అధికారులు,పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ,అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ,కార్యదర్శులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: