CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధి, సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ శ్రీరామరక్ష.అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Share it:


  • బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్
  • అండగా ఉంటుంది.

• ఎంపీ నామా నాగేశ్వరరావు


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:: అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండల పర్యటనలో భాగంగా చండ్రుగొండలో రూ.2కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను, మద్దుకూరులో రూ.1.5కోట్లతో నిర్మించిన30డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావుతో కలిసి ప్రారంభించారు. 10మంది లబ్దిదారుకులకు దళితబంధు పథకం యూనిట్లు (ట్రాక్టర్లను అందజేశారు. తొలుత టేకులబంజర గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బాలునాయక్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్పించి, నివాలర్పించారు. రేపల్లెవాడ గ్రామానికి చెందిన నడిపి క్రిష్ణ కుటుంబాన్ని, చండ్రుగొండకు చెందిన టిఆర్ఎస్ జిల్లా నాయకులు చీదెళ్ల పవన్ కుమార్ మాతృమూర్తి చీదెళ్ల ధనలక్ష్మికి నివాలర్పించారు. చీదెళ్ల ధనలక్ష్మి, బాలునాయక్ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసాను కల్పించారు. అదేవిధంగా చండ్రుగొండ రెవెన్యూ గ్రామంలో ధరళిలో తలెత్తిన సమస్యతో పట్టాదారు పాసుపుస్తకాలు కాక నిలిచిన పోయిన భూ సమస్యను ఎంపీ నామా దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. తిప్పనపల్లి రామాలయ నిర్మాణానికి తనవృంతు ఆర్ధిక సహాయం అందిస్తానని కమిటీ బాద్యులకు భరోసా కల్పించారు. తిప్పనపల్లి ముస్లిం మైనార్జీలకు షాదిఖానా మంజూరి చేయాలని వినతిని అందజేయగా కృషి చేస్తామని హమీ ఇచ్చారు. రామాలయంనిర్మాణానికి లకు ఆర్ధిక సహాయం అందిస్తానని కమిటీ బాద్యులకు భరోసా కల్పించారు. తిప్పనపల్లి ముస్లిం మైనార్టీలకు షాదిఖానా మంజూరి చేయాలని వినతిని అందజేయగా కృషి చేస్తామని హమీ ఇచ్చారు. ఏజెన్సీ దళితసేవా సంఘం ఆద్వర్యంలో వినతిని సమర్పించగా ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు పథకం అండేలా చూస్తామన్నారు. సిపిఎం మండల కమిటీ ఆద్వర్యంలో సీతాయిగూడెం వెంగళరావు ప్రాజెక్టు అలుగు నిర్మాణానికి వినితిని సమర్పించగా ప్రతిపాదనలు పంపటం జరిగిందని, అనుమతులు రాగానే పనులు జరిగేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు పథకం, దళితబంధు పథకం, కళ్యాణలక్ష్మి, పథకాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా పరిషత్ చైర్మన్ కో కోరం కనకయ్య, ఖమ్మ జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఎంపీపీ బానోత్ పార్వతి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా బాబు, ప్రధాన కార్యదర్సి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, చీదెళ్ల పవనకుమార్, బానోత్ రాముడు, నల్లమోతు వెంకటనారాయణ, మేడా మోహన్రావు, భూపతి రమేష్, మద్దిరాల చిన్నపిచ్చయ్య, ఉన్నం నాగరాజు, సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు, లంకా విజయలక్ష్మి, మార్తి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: