CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి గూడెంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం.పాల్గొన్న పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శివకుమార్

Share it:


మన్యం మనగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని ఆదివాసీ గ్రామమైన చింతలపాడు లో సీజనల్ వ్యాధుల పైన అవగాహన కార్యక్రమాన్ని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీజనల్ వ్యాధుల పైన ఆరోగ్య సదస్సు  నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ కుమార్  మాట్లాడుతూ, దోమల ద్వారా  మలేరియా, డెంగి, టైఫాయిడ్, డయేరియా, మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని , తగు జాగ్రత్తలు తీసుకోవాలని చింతలపాడు ప్రజానీకానికి వివరించారు. లక్షణాలు కనిపించిన వారికి రక్త నమూనాలు సేకరించారు. జలుబు వంటి  వ్యాధులకు మందులు అందజేశారు. ఈ కార్యక్రమం లో హెచ్ఈ ఓ వీరస్వామి, ఎంటిఎస్ అరుణ్ బాబు,వెంకట్, అరుణ, ఆశా లావణ్య, తదితరులు పాల్గోన్నారు.

Share it:

TS

Post A Comment: