జూలూరుపాడు జూలై 26, (మన్యం మనుగడ) ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వం దళిత కుటుంబాల్లో వెలుగు నింపేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "దళిత బంధు" పథకం యూనిట్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే రాములు నాయక్ చేతులమీదుగా ఈనెల 29న అందిస్తారని ఎంపిడిఓ తాళ్లూరి రవి తెలిపారు. మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి లావుడ్యా సోనీ, మండల ప్రత్యేక అధికారి బీమ్లా నాయక్ మాట్లాడుతూ.. మండలంలో 17 మంది దళితులను దళిత బంధు పథకానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపిక చేసిన యూనిట్లను గ్రౌండింగ్ చేసిన దుకాణాలు, ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీ వాహనాలను ఎమ్మెల్యే రాములు నాయక్ పంపిణీ చేస్తారన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Post A Comment: