CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారీ వర్షాలు,వరదల నేపధ్యంలో,జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం:రవాణా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భారీ వర్షాలు,వరదలు వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తం గా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. గోదావరి వరద సహాయక చర్యలపై సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం లో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అసాధారణంగా జులై 11 వ తేదికే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని చెప్పారు. పై నుండి వస్తున్న వరదలతో పాటు, వర్షాల వల్ల వస్తున్న వరదలకు గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నదని అన్నారు. గోదావరి ఉధృతి 60 అడుగుల వరకు వచ్చినా,యంత్రాంగం సేవలు అందించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినా,ఏర్పాట్లు బాగా చేసారని జిల్లా కలెక్టర్ అనుదీప్ ను,ఎస్పీ వినీత్ ను జిల్లా అధికారులను మంత్రి పువ్వాడ అభినందించారు. పట్టణంలో మురుగు నీరు నిల్వలు ఎప్పటికపుడు తోడేసేందుకు,విస్తా కాంప్లెక్స్ తో పాటు ఇతర ప్రాంతాలల్లో విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నట్లు తెలిపారు.వరద నీటిని తోడేందుకు అదనపు మోటారులు అందుబాటు లో ఉంచినట్లు తెలిపారు.నీటితో కాజ్ వేలు నిండిపోయి ఉన్నాయని ప్రజలు రవాణా చేయకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలిస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.నీరు నిలిచి ఉన్న కాజ్ వేలపై నుండి బస్సులు నడపరాదని ఆర్టీసి అధికారులను మంత్రి ఆదేశించారు.పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని చెప్పారు.సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు నిర్వహణకు తగినన్ని మందులు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులను అదేశించారు.విషపు జంతువుల వాక్సిన్ సిద్ధంగా ఉంచాలని తెలిపారు.


వరడతగ్గు ముఖం పట్టినా సేవలు కొనసాగాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని,పునరావాస కేంద్రాల్లో ఆతిధ్యం బావుండాలని అధికారులకు మంత్రి సూచించారు.విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.ఎంపిడిఓ లు, ఎంపిఓ పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షణ చేయాలని చెప్పారు.జిల్లా కలెక్టర్ అనుదీప్.మాట్లాడుతూ, జిల్లాలో 17 ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరినందున రవాణా చేయకుండా నియంత్రణ చేసినట్లు తెలిపారు.మోటార్లు ఏర్పాటు ద్వారా మురుగు నీరు పంపింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.పంపింగ్ చేయడంలో విద్యుత్ అంతరాయం వచ్చినా జనరేటర్లు వినియోగించి నీరు తొలగించు విదంగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.జిల్లాలోని 2345 ఇరిగేషన్ ట్యాంకు లున్నాయని,కట్టలు పరిరక్షణకు 21 వేల ఇసుక బస్తాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అనిశెట్టిపల్లి - ఆళ్లపల్లి రహదారిలో సంపత్ నగర్ వద్ద,బిటిపిఎస్ వద్ద రహదారుల్లో రవాణా సేవలు పునరుద్ధరణ చేసినట్లు చెప్పారు.ముంపు మండలాల్లో 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న గర్భిణీ లు 32 మంది ని గుర్తించి ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.పారిశుద్ధ్య కార్యక్రమాలు చాలా ముఖ్యమని బ్లీచింగ్,టెమోపాస్ రసాయనాలను సిద్ధంగా ఉంచమన్నారు.ప్రతి మండలంలో సహాయక చర్యలు పర్యవేక్షణకు సెక్టోరియల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. కలెక్టరేట్,పిఓ ఐటిడిఎ,సబ్ కలెక్టర్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితిలో సేవలు వినియోగానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 24 మంది సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.అన్ని రకాలుగా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసారు.ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు,జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం,అశ్వారావుపేట శాసనసభ్యులు పొందేం వీరయ్య,మెచ్చా నాగేశ్వరరావు,పిఓ ఐటిడిఎ గౌతమ్,ఎఎస్పీ రోహిత్ రాజ్, ఎస్పీ డా వినీత్,అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,భద్రాచలం అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ వరద సహాయక చర్యలను పవర్ పాయింట్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Share it:

TS

Post A Comment: