CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వరావుపేట రిజర్వ్ ఫారెస్ట్ నందు నాటు తుపాకీ కలకలం..

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండల కేంద్రంలో పాపిడి గూడెం వెళ్లే మార్గ మధ్యలో రిజర్వ్ ఫారెస్ట్ నందు ఒక నాటు తుపాకీ పట్టుకొని జంతువులను వేటాడుటకై ఒక గుర్తు తెలియని వ్యక్తి చెట్టు మీద ఎక్కి కూర్చుని ఉండగా అప్పుడే అటువైపుగా రోడ్డుపై నడుస్తూ వెళ్లే కొందరు యువకులు అతనిని గమనించినట్లు తెలిపారు. వెంటనే తన వద్ద ఉన్న ఫోన్ కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉండగా తుపాకీని అక్కడే పడవేసి ఆ వ్యక్తి పరారయ్యినట్లు వివరించారు. ఫోటోలు తీసిన సతీష్ అనే యువకుడు వెంటనే స్థానిక ఎస్సై చల్లా అరుణకు, ఫారెస్ట్ అధికారి కి సమాచారం ఇవ్వడంతో ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకొని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వారిని వివరణ కోరగా ఫోటోలను ఆధారం చేసుకుని గుర్తుతెలియని ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఫారెస్టు అధికారి కార్యాలయానికి తుపాకీని తరలించారు.

Share it:

TS

Post A Comment: