CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ నారం రాజశేఖర్ అద్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్యం పనులు.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్యం పనులు చేయించడం జరుగుతుంది. ఈ సందర్బంగా సర్పంచ్ నారం రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ప్రజలు సీజనాల్ వ్యాధుల బారిన పడకుండా, దోమల ఎదుగుదలను నివారించుకోవడానికి ముందస్తుగానే పారిశుధ్యం పనులు చెయ్యడం జరుగుతుందని అన్నారు. అనంతారం, పండువారిగూడెం గ్రామంలో స్కూల్ ని విజిట్ చేసి పిల్లలు చదువుకునే విధానాన్ని టీచర్స్ ని అడిగి తెలుసుకొని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు, పాటించడం, పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవాలని పిల్లకు, టీచర్స్ కి తెలియజేయడం జరిగిందని తెలిపారు. కొండతోగు గ్రామానికి చెందిన 13 మంది పిల్లలు పండువారిగూడెం గ్రామానికి 2 కిలోమీటర్లు నడిసి రావాలంటే స్కూల్ కి పిల్లలు సరిగ్గ రావడం లేదని తెలిసిన వెంటనే ఎంఈఓతో మాట్లాడి, కొండతోగు గ్రామంలోనే స్కూల్ చెప్పే విధంగా చూడండని చెప్పడం జరిగిందని, ఎంఈఓ ఈ విసియాన్ని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పడం జరిగిందని తెలిపారు. అంగన్వాడి స్కూల్ నీ విజిట్ చేసి రికార్డ్స్ పరిశీంచి, స్కూల్ విషియాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, మల్లాయిగూడెం గ్రామo లో మన ఊరు -మన బడి కార్యక్రమం లో పనులును పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోడం బుచప్ప, సెక్రటరీ సుజాత, వార్డ్ సభ్యులు, పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: