CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారీ వరద పై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదు, సమ్మక్క బ్యారేజ్ వరద ఉధృతి పై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు.గురువారం కన్నాయి గూడెం మండలంలోని చింతగూడెంలో సమ్మక్క బ్యారేజ్ వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య, ఐ టి డి ఏ పి ఓ అంకిత్ ల తో కలిసి పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ములుగు జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైనదని మహారాష్ట్ర, చతిస్గడ్ నుండి నీరు వర్షాల కారణంగా సమ్మక్క బ్యారేజీలో ఎక్కువ నీరు వచ్చిందని తుపాకులగూడేం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్ లో 14 లక్షల క్యూసెక్కుల నీరు

పారుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.కన్నాయి గూడెం మండలంలో దిగువ ఉన్న ఇండ్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు వారికి త్రాగునీరు భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.జిల్లాలో ప్రజా ప్రతినిధులు సహకరి స్తున్నారని ప్రజలు కూడా సహకరించి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కన్నాయి గూడెం మండలంలో ఎనిమిది పురవాస కేంద్రాలలో ప్రజలు స్వచ్ఛందంగా రావాలని ప్రభుత్వ భవనాలు ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునవస కేంద్రాల్లో అధికారులు శానిటైజర్ త్రాగునీరు భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.మండల అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి,ఉన్నతాధికారులతో, సిబ్బంది తో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో మరో 3 రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.ప్రజలు అత్యవసర పరిస్థితులు మాత్రమే బయటకు రావాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్య క్రమంలో కన్నాయిగూడెం మండల స్పెషల్ ఆఫీసర్ డిపిఓ వెంకటయ్య,తాసిల్దార్ వీరస్వామి,ఎంపీడీవో ఫణి చంద్ర, ప్రజా ప్రతినిధులు,ఇతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: