CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐటీసీ యాజమాన్య సహకారంతో గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి,బూర్గంపహాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం నందు గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు ఐటీసీ సహకారంతో వారు అందించిన పలు రకాల నిత్యావసర సరుకులను సుమారు 1100 కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి ముంపు ప్రాంత బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు, పంపుకు గురైన ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబానికి రెండు నెలలపాటు 25 కిలోల బియ్యంతో పాటు పలు రకాల నిత్యావసర సరుకులు అందజేసినట్లు ఆయన అన్నారు, అదేవిధంగా ముంపు ప్రాంత ప్రజలకు ఐటిసి యాజమాన్యం చేస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ కరోనా సమయంలో నేడు గోదావరి వరద మంపు సమయంలో బాధితులకు అండగా నిలబడడం గొప్ప విషయం అన్నారు, పినపాక నియోజకవర్గం పరిధిలో ఐటిసి యాజమాన్యం ఉండటం పేద మధ్యతరగతి కుటుంబాలకు అదృష్టం అన్నారు.ఐటీసీ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. వరద బాధితులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారు భరోసా కల్పించారు, వరద సహాయం విషయంలో అపోహలు ఎవరు నమ్మొద్దని ప్రభుత్వం అందరికీ సహాయం అందిస్తుందని అన్నారు, పినపాక నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 13 వేల బాధిత కుటుంబాలకు ఇంటింటికి 10 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు ఆయన అన్నారు, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్థానిక ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐటిసి యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి, డీజీఎం హెచ్ ఆర్ శ్యామ్ కిరణ్, యూనిట్ ఫినాన్స్ హెడ్ రాజశేఖర్, అడ్మిన్ చీఫ్ మేనేజర్ చెంగలా రావు, హెచ్ఆర్ మేనేజర్ నాగరాజున్, జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, హరి ప్రసాద్ బూర్గంపాడు మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: