CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మావోయిస్టు పార్టీ సహకరిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్... నగదు, విప్లవ సాహిత్య పుస్తకాలు,3 సెల్ ఫోన్లు స్వాధీనం..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సహకరిస్తూ వారికి అవసరమైన డబ్బులు సరుకులు విప్లవ సాహిత్య పుస్తకాలు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాలు ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్సై రవికుమార్ 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ సిబ్బందితో తో కలిసి చిన్ననల్లబెల్లి సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం వైపు నుండి వస్తున్న మోటార్ సైకిల్ AP20 N 8102 గల మోటార్ సైకిల్ వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పార్పోటుకు ప్రయత్నించగా పోలీస్ వారు ఇద్దరిని వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకొని విచరించగా వారి పేర్లు 1.నాగయ్య ఈదర గ్రామం, ఏలూరు జిల్లా, 2.శ్రీహరిబాబు రామవరం గ్రామం, చుంచుపల్లి మండలం అని గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ మావోయిస్టు పార్టీ వారి అవసరమైన డబ్బులు సరుకులు సరఫరా చేస్తున్నామని అదేవిధంగా ఈరోజు కూడా మావోయిస్టు పార్టీ వారి ఆదేశాలపై ఇసుక కాంట్రాక్టర్ బుచ్చిరాజు వద్ద నగదు, రామవరం గ్రామం చెందిన రామగిరి నాగరాజు వద్ద నుండి విప్లసాహిత పుస్తకంలో సేకరించి మావోయిస్టు పార్టీకి నాయకులకు అప్పచెప్పడానికి అడవికి వెళ్తున్నామని పోలీసు వారు అదుపులో తీసుకొని విచారించగా నేరము ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 10,0000/- రూపాయలు నగదు, మోటార్ సైకిల్, ముద్దాయిలు సంబంధించిన 3 సెల్ ఫోన్లు, విప్లవ సాహిత్య పుస్తకలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజు మాట్లాడుతూ కాంట్రాక్టర్స్, వ్యాపారస్తులు ఎవరు కూడా మావోయిస్టు పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించవద్దని మావోయిస్టు వల్ల ఆదివాసి గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని మావోయిస్టు పార్టీ వాళ్ళు ఎవరైనా చందల కోసం బెదిరిస్తే వెంటనే పోలీస్ శాఖ వారికి తెలియపరచాలని కోరారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్, ఎస్సై రవికుమార్, సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: