CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉద్యాన,వాణిజ్య పంటలతో రైతులకు అధిక మేలు.రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

Share it:


  • ఏడూళ్ళ బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు.


మన్యం మనుగడ,పినపాక:


వ్యవసాయ రంగంలో సంచలనం సృష్టిస్తూ, రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పినపాక మండల వైస్ ఎంపీపీ,ఆదర్శ రైతు కంది సుబ్బారెడ్డిని ఏడూల్ల బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు అభినందించారు. గురువారం పినపాక మండలం గొట్టెల్ల గ్రామంలో రైతు కంది సుబ్బారెడ్డి సాగుచేస్తున్న బోడ కాకర,డ్రాగన్ ఫ్రూట్ నర్సరీని ఏఈవో కొమరం లక్ష్మణ్ రావ్ సందర్శించారు.అనంతరం సాగు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సలహాలు సూచనలు చేశారు.నర్సరీలో డ్రాగన్ ఫ్రూట్,బోడ కాకర ఎటువంటి చీడపీడలు లేకుండా నూటికి నూరుశాతం ఆరోగ్యకరంగా,ఉన్నాయన్నారు.మండలంలోని రైతులు ఉద్యానవన వాణిజ్య పంటల సాగును విస్తరించాలని, ప్రత్యామ్నాయ పంటలతో అధిక లాభాలు సాధించవచ్చునని తద్వారా రైతుల ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్,రైతు కంది సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: