CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగులో అధిక దిగుబడి అదనపు రాబడి.ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా వినూత్న పత్తి సాగుకి శ్రీకారం

Share it:


  •  వ్యవసాయ శాఖ మరియూ నూజివీడు సీడ్స్ కృషితో రెండు ఎకరాల్లో కాటన్ బ్లాక్ ల ఏర్పాటు... విత్తనాల పంపిణీ..

మన్యం మనుగడ, మంగపేట.

అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు వల్ల అధిక దిగుబడి అదనపు రాబడి సాధ్యమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో సాంబశివరెడ్డి తన సొంత వ్యవసాయ క్షేత్రంలో నూతన పత్తి సాగు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేపట్టి విత్తనాలు విత్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని దీనిలో భాగంగా ములుగు జిల్లాలో నూజివీడు సీడ్స్ మరియు ఏరువాక కేంద్రం సంయుక్త సహకారంతో మంగపేట మండలం అకీనేపల్లి మల్లారం గ్రామంలో సిరి పత్తి వంగడం ఒక ఎకరం అర్మిత పత్తి వంగడం ఒక ఎకరం రెండు కాటన్ బ్లాక్ లను ఏర్పాటు చేసి సాగు చేయడం జరుగుతుందన్నారు. ఈ పద్ధతి వల్ల ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని గులాబీ రంగు పురుగు సమస్య నుంచి కొంతవరకు బయటపడవచ్చు అని ముఖ్యంగా పత్తి సేకరణ అంతా ఒకేసారి సింగిల్ పిక్ జరుగుతుందని ఆయన తెలిపారు నూజివీడు సీడ్స్ వరంగల్ ఏరియా మేనేజర్ డి మురళి మాట్లాడుతూ సింగిల్ పిక్ కాటన్ విధానాన్ని తమ నూజివీడు సీడ్స్ సంస్థ ప్రోత్సహిస్తుందని తెలిపారు ఇందులో భాగంగా వర్షాధార పత్తి సాగులో సింగిల్ పిక్ విధానాన్ని ప్రోత్సహిస్తూ తక్కువ సమయంలో అధిక దిగుబడి అదనపు రాబడి వచ్చే విధంగా అర్మిత సిరి విన్నర్ వంటి పత్తి వంగడాలను తమ నూజివీడు సీడ్స్ సంస్థ ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ములుగు జిల్లాలో తొలిసారిగా అకినేపల్లి మల్లారం గ్రామంలో సాంబశివరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సిరి అర్మిత నూతన పత్తి వంగడాలను సింగిల్ పిక్ పద్ధతిలో సీడ్స్ మరియు ఏరువాక కేంద్రం సహకారంతో రెండు బ్లాక్ లను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ విధానంలో సాలకు సాలుకు మధ్య 90 సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంతో విత్తనాలు విత్తినట్లు తెలిపారు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కి యకరాకు ఐదు ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం అవుతాయని తెలిపారు యకరాకు 22000 వేలకు పైగా మొక్కలు వుండేలా విత్తటం జరిగిందన్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో నూజీవీడు సీడ్స్ మరియు ఏరువాక కేంద్రం వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సులు క్షేత్ర దినోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ స్థానిక రైతులు లక్ష్మీనారాయణ కునాల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: