CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫారెస్ట్ అధికారుల దాడులు నశించాలి.కొత్త పొడు కొట్టేది లేదు పాతపోడు వదిలిపెట్టేది లేదు.

Share it:


  • ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

మన్యం మనుగడ, మంగపేట. మంగపేట మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముందు ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 25 గ్రామ పంచాయితీ ల పొడు భూముల సాగు రైతుల పై ఇటీవలే ఫారెస్ట్ అధికారుల దాడులను నిరసిస్తూ తీవ్రంగా ఖండించారు.. కొత్త పొడు కొట్టేది లేదు పాత పొడు వదిలి పెట్టేది లేదు, తాతలకాలం నుండి సాగుచేస్తున్న పొడుభుములను హరితహారం పేరిట పొడు భూముల చుట్టూ కందకాలను తవ్వుతూ స్ట్రేంచ్ లు కొడుతున్నారు. పోడు రైతుల పై కఠినంగా ప్రవర్తిస్తూ అక్రమ కేసులు నమోదుచేస్తున్నారు, పోడు రైతులు అందరూ భూమి కోసం భుక్తి కోసం పొడు సాగుచేస్తున్నరు కానీ విలాసవంతమైన జీవితం గడపడానికి కాదు,ఇప్పటికే సీజ్ చేసిన ట్రాక్టర్ లను వెంటనే రిలీజ్ చేసి అమాయకపు రైతుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి అని ఇకపై పొడు భూముల రైతులను బెదిరింపులకు గురిచేయకుండా పాత పొడు భూములు దుక్కి దున్నెందుకు అనుమతులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కరానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా వుంటుంది అర్హులైన ప్రతి పేద పొడు రైతుల కుటుంబలకు పేద కుటుంబాలకు కనీస వ్యవసాయ భూమిని చూపిస్తూ హక్కు పత్రాలు ఇవ్వాలి అని ప్రభుత్వన్నీ కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్ బాబు,జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, బ్లాక్ అధ్యక్షుడు ఈర్సవడ్ల వెంకన్న, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహారావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్సార్ ఖాన్, ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్సులు అయ్యోరి యన్నయ్య, మైపా లాలయ్య,లక్కీ వెంకన్న, కడబోయిన నరేందర్, మండల అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చౌలం వెంకన్న, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లన్న, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిడైతులా, యూత్ గౌరవ అధ్యక్షుడు జంగం బానుచందర్, ఉపాధ్యక్షుడు కుర్సం రమేష్, సీనియర్ నాయకులు మసిరెడ్డి వెంకట్ రెడ్డి, కారుపోతుల నరయ్య,నర్రా కిషోర్,కొమరం సారయ్య,బలన్న,వేమ రవి, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,మైనుద్దీన్, కోడెల నరేష్,వీర్ల రఘు, బూర్గుల సతీష్ గాంగేర్ల రాజరత్నం, ఎంపల్లి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: