CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను,సుమారు 42 లక్షల రూపాయలు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య,ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆస్పత్రులు,ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలు,బస్తీ దవఖానాలలో మెరుగైన సౌకర్యాలు కలిపిస్తుందన్నారు.రాబోయే రోజులలో పినపాక నియోజకవర్గం లో అదనంగా మరిన్ని ఆసుపత్రుల నిర్మాణం జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద అన్నారు.తెలంగాణ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ వైద్య రంగంలో విప్లమాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు గాను ప్రభుత్వం అత్యధిక యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. తెలంగాణను దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ లక్షమని తెలియజేశారు.విద్య, వైద్య వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తు,అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు.గొర్రెల పెంపకం, రైతుబంధు,మంచినీటి వసతి హరితహారం,పథకంపై కేంద్రం ప్రశంసలు కురిపించిందని అన్నారు.వ్యవసాయ రంగం అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు అన్నారు. కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ దే అని తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ,ప్రాధాన్యత ఇస్తున్నారని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ దవాఖానాలను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలన్నారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలు జనరల్ వార్డులకు వెళ్లి,బెడ్ల వద్దకు వెళ్లి,అందరి తో నేరుగా మాట్లాడారు.వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.పేరు వివరాలు అడిగి తెలుసుకుని వారి ప్రత్యేకంగా వార్డులలోకి కూడా వెళ్లి పేషంట్లతో మాట్లాడారు.వారికి ధైర్యం చెప్పారు.ఆస్పత్రిలో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,ఇంకా కావాల్సిన సదుపాయాల కోసం మరింత నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ నాగేశ్వరరావు,పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, హాస్పిటల్,సూపరింటెండెంట్ గిరి ప్రసాద్,ఎంపీటీసీ సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు,స్థానిక సర్పంచ్ బచ్చల.భారతి,మండల ప్రజాప్రతినిధులు,మండల అధికారులు,పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ కార్యదర్శులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: