CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సాయం 10 వేల రూపాయలు గోదావరి ముంపు ప్రాంతం బాధితులందరికీ చెల్లించాలి.సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా జిల్లా నాయకులు ఆర్.మధుసూదన్ రెడ్డి,

Share it:

 


 గోదావరి ముంపు ప్రాంత బాధితులకు ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సాయం 10 వేల రూపాయలను బాధితులఅందరికీ చెల్లించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా జిల్లా నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పినపాక మండలంలోని గోదావరి ముంపు ప్రాంతాలైన రాయిగూడెం, చింతలబయ్యారం, వెంకట్రావుపేట, భూపతిరావుపేట, టీ కొత్తగూడెం తదితర గ్రామాలను సందర్శించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.


                 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు లేదని కొంతమంది, ఒకే ఇంట్లో ఉంటున్నారు అనే పేరుతో కొంత మంది, పునరావాస కేంద్రాల్లో పేరు నమోదు చేసుకోలేదని కొంత మంది పేర్లు బాధితుల లిస్టు లో అధికారులు రాసుకో లేదని బాధితులు తెలిపారని అన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డులు అందరికీ అందించలేదని, కొంతమంది వేరే ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో అన్నదమ్ముల కుటుంబాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నారని, కొంతమంది బాధితులు చిన్న పిల్లల తో పునరావాస కేంద్రాల్లో ఉండలేక బంధువుల ఇళ్లలోనో, పరిచయస్తుల ఇళ్లలోనో తలదాచుకున్నారు అని అన్నారు. కావున ఎలాంటి నిబంధనలు లేకుండా ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సాయం 10 వేల రూపాయలు గోదావరి ముంపు బాధితులు అందరికీ చెల్లించాలని అధికారులను కోరారు. అదే విధంగా గోదావరి ముంపు బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నిత్యావసర సరుకులు ముంపు గ్రామాల లో అందజేయకుండా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలలో ఉంచి పంపిణీ చేయడం వలన బాధితులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున ముంపు బాధితుల బియ్యం, నిత్యవసర సరుకులు ముంపు గ్రామాల లోనే పంపిణీ చేయాలని అధికారులను కోరారు.

        ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పినపాక మండల నాయకులు చెట్టుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: