CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలనీ రాస్తారోఖో-PDSU.

Share it:



తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు భారీ మొత్తంలో పెంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ,తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలు, టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

(పి డి ఎస్ యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  

*కొమరారం -గుండాల రహదారి పై రాస్తా రోఖో* నిర్వహించారు.


ఈ సందర్భంగా 

*పి డి ఎస్ యూ తెలంగాణ అధ్యక్షులు ఎస్ నాగేశ్వర రావు* మాట్లాడుతూ తెలంగాణ లో విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ హామీ కి విరుద్ధంగా విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, టికెట్ ధరలు భారీగా పెంచడం దారుణమని అన్నారు. రు.165 రూపాయలు ఉన్న మంత్లీ పాస్ ను రు.400 పెంచారని , 

495 రూపాయలు ఉన్న మూడు నెలల పాస్ ను 1200 రూపాయలను పెంచారని ఇది ముమ్మాటికీ విద్యార్థులను విద్య కు దూరం చేసే కుట్రలో భాగమేనని అన్నారు. తెలంగాణ లో పేద , సాధారణ ప్రజలు ప్రయాణించే పేదల వాహనం ఐన ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచడం కెసిఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం అన్నారు. తక్షణమే పెంచిన ఆర్టీసీ చార్జీలు,బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలి లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.


గ్రామాలకు తరలండి కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన లో ఉన్న పి డి ఎస్ యూ బృందం కోమురారం గ్రామంలో నిర్వహించిన రాస్తా రోకో


 కార్యక్రమంలో  

 PDSU స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె.స్వాతి,

పి డి ఎస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సంధ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కంపాటి పృధ్వీ , ఓయూ నాయకులు శ్వేత, మీనా, వైష్ణవి, మేనక, శాంభవి, నందిని, జ్యోతి, జ్ఞానేశ్వరీ, శ్రావణ్, PDSU కొత్తగూడెం జిల్లా నాయకులు రంగ,లక్షి,జ్యోతి,సునీత, పార్థ సారథి,ప్రణీత్,తరుణ్,సాయి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: